Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న గంట, అరగంట రాంబాబు.. నేడు ఆంబోతు రాంబాబునా... అంబటి ఫైర్

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2022 (09:30 IST)
వైకాపా నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబును విపక్ష నేతలు ఓ ఆటాడుకుంటున్నారు. ముఖ్యంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రిగా ఉన్న అంబటి రాంబాబును ఆంబోతు రాంబాబుగా విమర్శలు గుప్పించారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. నిన్నామొన్నటివరకు గంట, అరగంట రాంబాబు ఉన్నారనీ, ఇపుడు ఆంబోతు రాంబాబు అంటున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఇత దిగజారి మాట్లాడటం ఏమాత్రం సరికాదని అన్నారు. దీనికి కారణం ఆయన వద్ద సబ్జెక్టు లేదని, అందుకే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని చెప్పారు. 
 
"నీ వద్ద పనిచేసే చెంచాగాళ్ళో, నీ మోచేతి నీళ్లు తాగేవాళ్లో ఈ మాటలు అంటే ఫర్వాలేదు. 14 సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా చేసినవాడివి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమకాలికుడినని చెప్పుకుంటున్నవాడివి.. కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకున్నవాడివి... ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రధాని పదవినే వద్దనుకున్నానని చెప్పుకున్న నువ్వు నన్ను ఇంత చీఫ్‌గా మాట్లాడతావేంటయ్యా చంద్రబాబూ" అంటూ మండిపడ్డారు.
 
నీ దగ్గర సబ్జెక్టు లేదు సమాధానం లేదు కాబట్టే ఇలా మాట్లాడుతున్నావు. గంట అంటావు. అరగంట అంటావు. నేను ఆంబోతునా.. మరి నువ్వేం చేశావు. నీ రాజకీయ చరిత్ర ఏంటి. ఆంబోతులకు ఆవులను సప్లై చేసి సీటు పొందిన వ్యక్తివి కాదా నువ్వు. అధికారం కోసం నువ్వు చేసిన అకృత్యాలు, అన్యాయాలు ఎవరికి తెలీదు అంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments