ఆ భవనాలను కూడా అలానే కూల్చివేస్తారా? జగన్‌కు నారా లోకేశ్ ప్రశ్న

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (13:43 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన భవాలను కూడా ప్రజా వేదిక కూల్చివేసినట్టుగానే కూల్చివేస్తారా అంటూ ప్రశ్నించారు. 
 
ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో నిర్మాణాలు పూర్తయిన భవనాల ఫోటోలు పెట్టి, ప్రశ్నల వర్షం కురిపించారు. సెక్రటేరియట్, శాసనసభ, శాసనమండలి, రాజభవన్‌, హైకోర్టు, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, హెచ్‌వోడీ భవనాలు, ఇలా పరిపాలనకు కావాల్సిన సమస్తం, ఆధునిక సౌకర్యాలతో ఇప్పటికే రూపుదిద్దుకున్నాయి. 
 
గత మూడేళ్ళుగా, పరిపాలన అంతా ఇక్కడ నుంచే సాగుతోంది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా, పరిపాలన ఇక్కడ నుంచి కొనసాగించవచ్చు. అన్నీ అమరిన తర్వాత ఇప్పుడు అమరావతి నుంచి రాజధానిని తరలించాల్సిన అవసరం ఏముంది? 
 
రాజధాని మారితే ఈ భవనాలను ఏం చేస్తారు ? వీటిని కూడా ప్రజా వేదిక లాగా కూల్చేస్తారా? ఉన్నవి పీకేసి, కొత్త వాటి కోసం అదనంగా ఖర్చు చెయ్యటం, తుగ్లక్ నిర్ణయం కాదా? అంటూ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

ప్రైమ్ వీడియోలో మా దృష్టి గొప్ప కథలను నిర్మించడం మీదే ఉంది - పద్మా కస్తూరిరంగన్

ప్రణవ్ మోహన్ లాల్.. డీయస్ ఈరే... శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా విడుదల

పురుషః పాత్రల ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments