Webdunia - Bharat's app for daily news and videos

Install App

మింగడానికి మెతుకు లేదుగానీ... 33 రాజధానులా?

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (16:09 IST)
నవ్యాంధ్ర రాజధాని తరలింపు అంశంపై రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, రాజధానిని మరో ప్రాంతానికి తరలించడానికి వీల్లేదని వారు డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తారు. ఈనేపథ్యంలో తుళ్లూరులో రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరికి టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మద్దతు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, 'మింగడానికి మెతుకు లేదుగానీ.. 33 రాజధానులు నిర్మిస్తారా...? నిజంగా అంత ధైర్యముంటే అమరావతి నిర్మాణం పూర్తి చేశాక.. ఎన్ని రాజధానులు నిర్మిస్తావో నిర్మించు' అంటూ సవాల్ విసిరారు. 
 
నాడు అమరావతికి అంగీకరించిన జగన్‌.. ఇవాళ ఎందుకు ప్లేటు మార్చారంటూ నిలదీశారు. రాజధాని మార్పు సీఎం సొంత సమస్య కాదని.. 5 కోట్ల మంది ప్రజలదని, రైతుల పోరాటానికి అండగా ఉంటామని గొట్టిపాటి రామకృష్ణ అన్నారు.
 
అలాగే, బీజేపీ నేత గోపీనాథ్ దాస్ స్పందిస్తూ, రాష్ట్రంలో రావణరాజ్యం నడుస్తోందని.. ప్రజల కష్టాలు చూస్తూ సీఎం జగన్‌ రాక్షస ఆనందం పొందుతున్నారంటూ మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments