Webdunia - Bharat's app for daily news and videos

Install App

రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా... ఎస్ఐకు వైకాపా నేత వార్నింగ్

ఠాగూర్
శుక్రవారం, 18 జులై 2025 (17:06 IST)
ఏపీలో అధికారం మారినప్పటికీ వైకాపా నేతల బెదిరింపులు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ.. వైకాపా నేతలు మాత్రం తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైకాపా మాజీ మంత్రి  పినిపే విశ్వరూప్ ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు. రానున్నది వైకాపా ప్రభుత్వమే.. నేను ఎక్కడున్నా.. నిన్ను మాత్రం వదలను. నీ అంతు చూస్తా. నీతో జైలు ఊచలు లెక్కపెట్టిస్తా. వీఆర్‌‍కు పంపిస్తా అంటూ అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి.ప్రశాంత్ కుమార్‌ను ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. 
 
ఇటీవల వైకాపా అల్లవరం మండలం అధ్యక్షుడు బాపూజీ కుమారుడిపై ఆకారణంగా కేసు పెట్టి చిత్రహింసలకు గురిచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై వైకాపా కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ, 'సీఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విశ్వరూప్ కొత్తపేట సబ్ జైలుకు రిమాండ్‌కు పంపించారని విశ్వరూప్ ఆరోపించారు. "ఈ ఐదేళ్ల కాలంలో మంత్రి కోసమో, ఎమ్మెల్యే కోసమో పనిచేసుకో. కానీ ఆకారణంగా వైసీపీ కార్యకర్తలపై వేధింపులకు దిగి కేసులు పెడితే నీతో ఊచలు లెక్కపె ట్టిస్తా" అంటూ హెచ్చరించారు.
 
ఒక పక్షానికి అనుకూలంగా పనిచేసి తమ కార్యకర్త వేధింపులకు గురిచేయవద్దని, పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగే పరిస్థితులు తేవద్దని హితవు పలికారు. సీఐపై విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలు అటు వైసీపీ. ఇటు పోలీసు వర్గాల్లోనూ తీవ్రచర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments