Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

76 యేళ్ల ముసలోడివి... ఇంకెంతకాలం బతుకుతావ్ : పేర్ని నాని

Advertiesment
perni nani

ఠాగూర్

, సోమవారం, 14 జులై 2025 (08:15 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి వైకాపా నేత, మాజీ మంత్రి పేర్ని నాని మరోమారు పరుష పదజాలంతో బూతులు తిట్టారు. 76 ఏళ్ల ముసలోడివి నువ్వు ఎంతకాలం బతుకుతావ్? 50 ఏళ్ల జగన్‌ను భూస్థాపితం చేస్తావా? అది నీ తరమా, నీ కొడుకు తరమా?' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
 
పెడనలో ఆదివారం నిర్వహించిన వైకాపా కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని నోటికొచ్చినట్టుగా మాట్లాడారు. తాను నరికేయండని అనలేదంటూనే.. వివాదాస్పదంగా మాట్లాడారు. 'అరేయ్.. నేను అనాలంటే పట్టపగలే వేసేయమని చెబుతాన్రా, చీకటిలో నరికేయండని అనలేదు' అంటూ మళ్లీ రెచ్చగొట్టారు. ఎన్నికల ముందు కూటమి నేతల ప్రసంగ వీడియోలను ప్రదర్శిస్తూ అవమానకరంగా మాట్లాడారు.
 
'వల్లభనేని వంశీని ఏదో చేస్తానంటూ ఎన్నికల ముందు నారా లోకేశ్ మాట్లాడాడు. ఐదు నెలలు వంశీని బెజవాడ జైల్లో ఉంచారు. ఏం చేశావ్..' అని పేర్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘ఆరోగ్యం బాగు చేసుకొని మరో మూడు నెలల్లో కొడాలి నాని గుడివాడలో అడుగు పెడుతున్నాడు. ఎవడొస్తాడో రండ్రా.. దమ్ముంటే చెడ్డీతో నడిపించండ్రా చూద్దాం..' అని రెచ్చగొట్టారు. 
 
'అయ్యన్నపాత్రుడు 80 ఏళ్లొచ్చినా చావలేదు' అని స్పీకర్ను పరుష పదజాలంతో దూషించారు. 'కొల్లు రవీంద్ర కాదు.. సొల్లు రవీంద్ర. అన్నం కాకుండా.. బ్రాందీ షాపుల్లో కమీషన్లు తింటున్నాడు. కృత్తివెన్నులో 45 ఎకరాలు ఆక్రమించాడు. త్వరలో ఆధారాలతో సహా బయటపెడతాను' అని పేర్ని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్‌లో బంగ్లాదేశ్ పౌరులకు ఓటు హక్కు