Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌న్నీ టీమ్ పైన ఫ్యాన్స్ ఫైర్... ఇంత‌కీ ఏం జ‌రిగింది..?

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (10:23 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో ఓ సినిమా రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న‌ పూజా హెగ్డే న‌టిస్తోంది. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ను ఖ‌రారు చేయ‌లేదు. హైద‌రాబాద్‌లో తొలి షెడ్యూల్ కంప్లీట్ అయిన తరువాత కొంత గ్యాప్ ఇచ్చారు. దీంతో బ‌న్నీ స‌మ్మ‌ర్ ట్రిప్‌కి వెళ్లాడు.
 
అయితే... బ‌న్నీ సినిమా గురించి ఫ్యాన్స్‌కి ఎగ్జైట్ చేసే న్యూస్ చెప్ప‌బోతున్నారు అంటూ బన్నీ టీమ్ సోష‌ల్ మీడియాలో ఎనౌన్స్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఏ న్యూస్ చెబుతారా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తే.... త్రివిక్ర‌మ్‌తో చేస్తున్న సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెల 5 నుంచి అని ఎనౌన్స్ చేసారు. అంతే... ఫ్యాన్స్‌కి మండింది. అంతేగా... కొత్త ప్రాజెక్ట్ గురించి చెబుతారో..? లేక త్రివిక్ర‌మ్ సినిమా రిలీజ్ డేట్ చెబుతారో ఇంకేమ‌న్నా చెబుతారా అని ఎదురు చూస్తే.. సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసామ‌ని చెప్పారు. 
 
ఇది ఎగ్జైట్ చేసే న్యూసా అంటూ బ‌న్నీ ఫ్యాన్స్ బ‌న్నీ పీఆర్ టీమ్ పైన ఫైర్ అయ్యారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా పీఆర్ టీమ్ ఫైర్ అయిన ఫ్యాన్స్‌కి స‌ర్ధి చెప్పే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ వాళ్లు శాంతించ‌డం లేదు. ఇకనైనా ఆచితూచి ఎనౌన్స్‌మెంట్ ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా ఇలాగే అతి చేస్తే... ఎవ‌రో కాదు ఫ్యాన్స్ ఎదురు తిరుగుతారు. బ‌న్నీ టీమ్ ఇకనైనా గుర్తిస్తే బాగుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments