Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం చంద్రబాబు రూ.22 కోట్లకే కొట్టేయాలనుకున్నారు... ఆళ్ల(వీడియో)

తమిళనాడు సదావర్తి భూములను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం రూ. 22 కోట్లకే కొట్టేయాలనుకున్నారంటూ వైసీపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ ఆరోపించారు. ఈ రోజు జరిగిన సదావర్తి భూముల వేలంపాట అనంతరం ఆయన విలేకరులతో

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (19:55 IST)
తమిళనాడు సదావర్తి భూములను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం రూ. 22 కోట్లకే కొట్టేయాలనుకున్నారంటూ వైసీపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ ఆరోపించారు. ఈ రోజు జరిగిన సదావర్తి భూముల వేలంపాట అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగా అత్యంత వివాదాస్పదమైన సదావర్తి సత్రానికి చెందిన భూముల బహిరంగ వేలం పాట సోమవారం ముగిసింది. చెన్నైలోని తితిదే సమాచార కేంద్రంలో ఈ భూముల బహిరంగ వేలం పాట జరిగింది. 
 
ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ అనురాధ నేతృత్వంలో ఈ భూముల వేలం పాట నిర్వహించగా, ఈ పాటలో రికార్డు స్థాయి ధర పలికింది. ఈ భూములను కడప జిల్లాకు చెందిన సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి రూ. 60.30 కోట్లకు సొంతం చేసుకున్నారు. 
 
ఈ భూముల వేలం పాట ప్రారంభ ధర రూ.27.45 కోట్లుగా నిర్ణయించారు. సదావర్తి సత్రానికి చెందిన 83.11 ఎకరాల భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో 22 కోట్ల రూపాయలకు విక్రయించింది. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎంతో విలువైన సదావర్తి భూములను కారుచౌకగా కట్టబెట్టారంటూ తన పిటిషన్‌లో ఆరోపించారు.
 
దీనిని విచారించిన హైకోర్టు 22 కోట్ల రూపాయలకు అదనంగా 5 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఆ భూములను మీరే సొంతం చేసుకోవచ్చంటూ ఆయనకు ఆఫర్ ఇచ్చింది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆయన ముందుకు రావడంతో ధరావత్తు చెల్లించాలని సూచించింది. హైకోర్టు చెప్పినట్టుగానే ఆయన చెల్లించారు. అయితే, మరొకరు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో, బహిరంగ టెండర్ ఆహ్వానిస్తూ వేలం వేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
 
ఫలితంగా ఈ భూముల వేలం పాటను చెన్నైలో నిర్వహించారు. ఇందులో రికార్డు స్థాయిలో రూ.60.30 కోట్ల ధర పలికింది. గతలో కంటే ఈ దఫా రూ.37.90 కోట్ల మేరకు అదనంగా పలికింది. తితిదే నిర్ణయించిన ప్రాథమిక ధర కంటే ఇపుడు అదనంగా రూ.32.85 కోట్లు సమకూరింది. ఆళ్ల రామకృష్ణ కామెంట్స్ వీడియో చూడండి...

సంబంధిత వార్తలు

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments