Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామ కాళ్ళలో దెబ్బతిన్న కణజాలం... రెండు కాళ్లకు కట్లు కట్టిన ఎయిమ్స్

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (08:36 IST)
రాజద్రోహం ఆరోపణలపై రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే కస్టడీలో తనను దారుణంగా కొట్టారంటూ రఘురామ ఆరోపించడంతో కోర్టు వైద్య పరీక్షలకు ఆదేశించింది. ఆర్మీ ఆసుపత్రి వైద్య పరీక్షల్లో ఆయన కాలి వేలు ఫ్రాక్చర్ అయినట్టు వెల్లడైంది.
 
ఇక, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందించారు. ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందిన రఘురామకు ఇటీవలే బెయిల్ మంజూరైంది. ఈ కేసు గురించి, ఆరోగ్య పరిస్థితి గురించి మీడియాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని న్యాయస్థానం రఘురామను ఆదేశించింది.
 
ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో రఘురామ కాళ్లలో కణజాలం తీవ్రంగా దెబ్బతిన్నట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దీంతో రఘురామ రెండు కాళ్లకు కట్లు కట్టిన ఎయిమ్స్ డాక్టర్లు రెండు వారాల విశ్రాంతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నడవొద్దని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రఘురామరాజు ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments