Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రింటర్‌ను ఎత్తిపడేసిన జేసీ.. ఫ్లైట్‌లోకి అడుగుపెట్టనీయమంటున్న విమాన సంస్థలు...

ఎయిర్‌పోర్టులో పనిచేసే సిబ్బందిని.. ఎయిర్ హోస్టెస్‌ను చూస్తే వీళ్లెంత లక్కీ.. హ్యాపీగా భలే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాం. కానీ, విమానయాన సిబ్బందికి తమ పైఅధికారుల నుంచి కంటే రాజకీయ నేతల నుంచే ముప్పు అధ

Webdunia
శుక్రవారం, 16 జూన్ 2017 (12:41 IST)
ఎయిర్‌పోర్టులో పనిచేసే సిబ్బందిని.. ఎయిర్ హోస్టెస్‌ను చూస్తే వీళ్లెంత లక్కీ.. హ్యాపీగా భలే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాం. కానీ, విమానయాన సిబ్బందికి తమ పైఅధికారుల నుంచి కంటే రాజకీయ నేతల నుంచే ముప్పు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతన్న సంఘటనలే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
 
మొన్నటికి మొన్న శివసేన ఎంపీ సీటు విషయంలో ఓవరాక్షన్ చేసి కొన్నాళ్లు విమానయాన సంస్థల నిషేధాన్ని ఎదుర్కొన్నారు. మేమేమన్న తక్కువా అనుకున్నారేమో తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వైజాగ్ ఎయిర్‌పోర్టులో తన విశ్వరూపాన్ని చూపించారు. తాను ఎయిర్‌పోర్టుకి రావడం కాస్త లేటవుతుందని ఫోన్ చేసి అధికారులకు చెప్పినా టైం అయిపోయిందని.. బోర్డింగ్ పాస్ ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పడంతో జేసీకి కోపం వచ్చిందట. అప్పటికే చెకిన్ అయిపోవడంతో తర్వాత ఫ్లయిట్‌లో పంపిస్తామని ఇండిగో సిబ్బంది చెప్పడంతో జేసీకి చిర్రెత్తుకొచ్చింది. దాంతో దౌర్జన్యం చేశారు. ఆ విమానయాన సంస్థకు చెందిన టిక్కెట్ ప్రింటర్‌ను ఎత్తి కిందపడేశారు. దీన్ని సీరియస్‌గా పరిగణించిన విమానయాన సంస్థలు ఆయనపై వేటు వేస్తున్నాయి. 
 
సాధారణంగా నిబంధనల ప్రకారం 45 నిమిషాల కంటే ముందే రావాలి. ఫ్లయిట్ బయల్దేరే సమయానికి 45 నిమిషాల ముందే ప్రయాణికుల చెకిన్ పూర్తి చేయాలన్నది నిబంధన. కానీ జేసీ 28 నిమిషాల ముందు వచ్చారు. అప్పటికే చెకిన్ అయిపోవడంతో తర్వాత ఫ్లయిట్ లో పంపిస్తామని ఇండిగో సిబ్బంది చెప్పడంతో జేసీకి చిర్రెత్తుకొచ్చింది. దాంతో దౌర్జన్యం చేశారు. 
 
ఆయన ప్రవర్తనను ఖండిస్తూ ఇకపై తమ  విమానాల్లో ప్రయాణించేందుకు అనుమతించబోమని ఇండిగో స్పష్టం చేసింది. ఆ తర్వాత ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్, విస్తారా, స్పైస్ జెట్, ఎయిరేషియా, గో ఎయిర్ కూడా దివాకర్ రెడ్డిపై వేటు వేశాయి. దీంతో హీరో రాంచరణ్‌కు చెందిన ట్రూ జెట్ మినహా మొత్తం ఏడు విమానయాన సంస్థలు ఆయనపై చర్య తీసుకున్నట్టు అయింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments