Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొన్న దోమల మందు.. ఇపుడు విషం సేవించిన బుల్లితెర నటి.. మీడియా బ్లేమ్ చేస్తోందనీ...

తన ప్రియుడు ఆత్మహత్యా కేసులో మీడియా మీడియా బ్లేమ్ చేస్తోందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ బుల్లితెర నటి నీలాణి శుక్రవారం రాత్రి విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Webdunia
శనివారం, 22 సెప్టెంబరు 2018 (14:08 IST)
తన ప్రియుడు ఆత్మహత్యా కేసులో మీడియా మీడియా బ్లేమ్ చేస్తోందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన తమిళ బుల్లితెర నటి నీలాణి శుక్రవారం రాత్రి విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నిజానికి తన ప్రియుడు ఆత్మహత్య చేసుకోగానే ఆమె దోమల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది కూడా. ఉపుడు రెండోసారి ఇదే విధంగా ప్రవర్తించింది.
 
చెన్నై, కేకే నగర్‌కు చెందిన నీలాణి.. తమిళ సినీ ఇండస్ట్రిలో చిన్నచిన్న వేషాలు వేస్తూ, సీరియల్స్‌లో నటిస్తోంది. ఈమెకు అసిస్టెంట్ డైరెక్టరుగా ఉన్న గాంధీ లలిత్ కుమార్ పరిచయం కాగా, ఆ తర్వాత వీరిద్దరూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో లలిత్ కుమార్ పెళ్లి చేసుకోవాలంటా తొందరపెడుతున్నాని ఆరోపిస్తూ మైలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపం చెందిన లలిత్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
ఆ తర్వాత ఆమె కూడా దోమల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇరుగుపొరుగువారు వెంటనే ఆస్పత్రిలో చేర్చడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ నేపథ్యంలో తన క్యారెక్టర్‌కు మచ్చతెచ్చేలా మీడియా తనను బ్లేమ్ చేస్తోందంటూ ఆమె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్, మీడియా కవరేజ్ తనను డిప్రెషన్‌లోకి నెట్టివేసిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆమె విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం నీలాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments