Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నిరాయుధుడు... ప్లీజ్ వదిలివేయండి.. : నాగబాబు

Webdunia
మంగళవారం, 28 మే 2019 (17:20 IST)
అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోవడం, ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయడంపై జనసేన పార్టీ నేత, సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన చంద్రబాబును టార్గెట్ చేసుకుని ట్రోల్ చేయడం సబబు కాదన్నారు. ప్రత్యర్థి నిరాయుధుడై ఎదురుగా ఉన్నప్పుడు ఆయన్ను వదిలివేయాలేగానీ దాడి చేయరాదన్నారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు 151, టీడీపీకి 23, జనసేనకు ఒక్క సీటు చొప్పున సీట్లు వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో వైకాపాకు 22 ఎంపీ సీట్లు, టీడీపీకి మూడు సీట్లు వచ్చాయి. దీంతో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ, వాటిని ట్రోలింగ్ చేస్తూ కొందరు పైశాచికానందం పొందుతున్నారు. దీనిపై నాగబాబు స్పందించారు. 
 
"చంద్రబాబు గారు మన మాజీ సీఎం, ఇపుడు ఓటమిపాలైనంతమాత్రాన ఆయనను దారుణంగా విమర్శించడం తప్పు. మనిషి పవర్‌లో ఉండగా విమర్శించడం వేరు, ఓడిపోయాక విమర్శించడం చేతకానితనం. ప్రత్యర్థి నిరాయుధుడై ముందు నిలబడితే వదిలెయ్యాలి. అంతేకానీ, అవకాశం దొరికింది కదాని ట్రోల్ చేయడం ఒక శాడిజం" అని నాగబాబు పోస్ట్ చేశారు. 
 
కాగా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాగబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇపుడు ఉన్నట్టుండి చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments