Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్షన్ కింగ్ మోహన్‌బాబును హౌస్ అరెస్ట్..

Webdunia
శుక్రవారం, 22 మార్చి 2019 (10:14 IST)
విద్యానికేతన్‌ విద్యార్థులకు 2014 నుంచి రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలేదని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫైర్ అయ్యారు. విద్యాభివృద్ధిపై ఏపీ సర్కార్‌కు చిత్తశుద్ధిలేదని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఇంటింటికీ తిరిగి అమలు కాని హామీలెందుకు ఇస్తున్నారని మోహన్‌బాబు ప్రశ్నించారు. 
 
తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఏ పార్టీ ప్రోత్సాహంతో తాను మాట్లాడటంలేదని మోహన్‌బాబు స్పష్టం చేశారు. దాదాపు రూ.19 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఎంతకాలం ఇలా అంటూ అడిగారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే.. ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సినీ నటుడు మోహన్ బాబుకు గృహ నిర్బంధం విధించారు. 
 
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం విపరీతమైన జాప్యం చేస్తోందంటూ మోహన్ బాబు శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత హోదాలో తిరుపతిలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చారు. ఇవాళ కుప్పంలో చంద్రబాబు నామినేషన్ కార్యక్రమం ఉండడంతో మోహన్ బాబు ర్యాలీ అవాంఛనీయ ఘటనలకు దారితీయొచ్చన్న ఉద్దేశంతో పోలీసులు ఈ ర్యాలీని అనుమతించడంలేదు. ఈ క్రమంలో మోహన్ బాబును బయటికి రానివ్వకుండా నివాసం చుట్టూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2: ది రూల్‌లో రష్మిక మందన్న చనిపోతుందా? పుష్పది హీరోయిజమా?

రాజు వెడ్స్ రాంబాయి క్లైమాక్స్ చూశాక నిద్రపట్టలేదు : వేణు ఊడుగుల

అల్లు అర్జున్ గురించి నిజాలు బయటపెట్టిన మాత్రుమూర్తి నిర్మల

ఎన్ని జరిగినా భార్య వెన్నుముకలా వుంది: జానీ మాస్టర్

కె.సీఆర్ స్పూర్తితో కేశవ చంద్ర రమావత్ సినిమా : హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments