Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 12 January 2025
webdunia

పంచ్ పేల్చిన అలీ.. పెళ్లాన్ని కూడా మర్చిపోతావా.. కలెక్షన్ కింగ్ చురక

Advertiesment
పంచ్ పేల్చిన అలీ.. పెళ్లాన్ని కూడా మర్చిపోతావా.. కలెక్షన్ కింగ్ చురక
, బుధవారం, 20 మార్చి 2019 (11:35 IST)
విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 69వ జన్మదిన వేడుకలు శ్రీ విద్యానికేతన్‌లో మార్చి 19 మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సినీప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టాలీవుడ్ కమెడియన్ అలీ వేదికపై మాట్లాడుతూ తనదైన శైలిలో కామెడీ పంచ్‌లతో నవ్వించడమే కాకుండా విద్యార్థులకు చక్కని సందేశం కూడా ఇచ్చారు. ఇక మోహన్ బాబు, అలీల మధ్య జరిగిన సంఘటనలు నవ్వు తెప్పించాయి. 
 
అక్కడికి వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును ఉద్దేశించి...  ఆపిల్ పండు సృష్టికర్త రాఘవేంద్రరావు గారేనని, బహుశా స్టీవ్ జాబ్స్ ఈయన తీసిన సినిమాలు ఎక్కువగా చూసి, ఆ ప్రేరణతోనే ఆపిల్ పండుని కొంచెం కొరికేసి తన ఆపిల్ బ్రాండ్‌కు లోగోగా పెట్టేసుకున్నాడని చెప్పాడు. ఇప్పుడు ఆ డివైజ్‌లకు మార్కెట్‌లో కోట్ల ధర పలుకుతోందంటూ సెటైర్లు వేసాడు. 
 
గన్ను కన్నా పెన్ను చాలా శక్తివంతమైనది. ప్రధానమంత్రి తన నిర్ణయాలను అమలు చేయాలన్నా, ఒక వ్యక్తిని అరెస్టు చేయాలన్నా పెన్నుతో సంతకం పెట్టాలి. ఒకరికి ఉద్యోగం రావాలన్నా, అదే ఉద్యోగం పోవాలన్నా ఈ పెన్ను ఉండాలి. అందుకే పెన్నుని మన గుండె దగ్గర పెట్టుకుంటాం. పెన్ను ఉపయోగించే ప్రతి ఒక్కడి గుండెలో ధైర్యం నిండి ఉంటుంది. మోహన్ బాబు గారికి ధైర్యం చాలా ఎక్కువ. ఇంత మంది విద్యార్థుల జేబులో పెన్ను పెడుతున్నారు.. దట్ ఈజ్ మోహన్ బాబు అని అలీ ప్రశంసించాడు.
 
తల్లిదండ్రులు తాము తినకపోయినా పిల్లల గురించి ఆలోచిస్తారు. కనుక విద్యార్థి దశ చాలా కీలకమని, తల్లిదండ్రులను బాగా చూసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని విద్యార్థులకు పిలుపునిచ్చారు. 
 
ఇక మోహన్ బాబు మాట్లాడుతూ అలీ మైక్ మరిచిపోయినందుకు సరదాగా మైక్ మర్చిపోయావు.. పెళ్లాన్ని కూడా మర్చిపోతావా అంటూ చురకంటించాడు. నేను ఇండస్ట్రీలోకి ఎలా నిరుపేదగా అడుగుపెట్టానో అలీ కూడా అలాగే వచ్చి ఇప్పుడు ఇంత స్థాయికి చేరుకున్నాడని పొగిడాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్ ఎ టాలెంట్... 'కన్నా నిదురించరా.. నా కన్నా నిదురించరా..' సితార స్టెప్పులు