Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోసాని బూతులు అబ్బబ్బా.. వాళ్లిద్దరికీ ఆయన పెయిడ్‌ ఆర్టిస్ట్‌

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (17:36 IST)
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై దర్శక నిర్మాత, సినీ నటుడు పోసాని కృష్ణమురళీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఏపీ సీఎం జగన్‌, ప్రశాంత్‌ కిశోర్‌ వికృత క్రీడకు పెయిడ్‌ ఆర్టిస్ట్‌గా పోసాని కృష్ణ మురళీ ఉన్నారని విమర్శించారు. పోసాని బూతులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, పవన్‌ కుటుంబం గురించి ప్రశాంత్‌ కిశోర్‌‌ మాట్లాడించారని ఆరోపించారు.
 
పవన్ కుటుంబ సభ్యుల గురించి పోసానితో ప్రశాంత్ కిశోర్‌ టీం మాట్లాడిస్తుంటే జగన్‌ ఎందుకు బహిరంగంగా వారించలేదని ప్రశ్నించారు. సామాన్యులు వినలేని.. మాట్లాడలేని భాషలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతుంటే జగన్‌కు ఆనందంలో మునిగితేలుతున్నారని విమర్శించారు. మద్యం షాపుల దగ్గర తాగిన తాగుబోతులు సైతం ఇలా మాట్లాడరేమో? అని అన్నారు.
 
డ్రగ్స్ మాఫియాకు ఏపీ అడ్డాగా మారిందని మాఫియాలో ఆఫ్ఘన్ టెర్రరిస్టులు కూడా కుమ్మక్కై దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ధరలు పెంచడం, దోపిడీ పాల్పడటం వంటి వాటితో ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు ప్రశాంత్ కిశోర్‌ డైరెక్షన్‌లో వైఎస్సార్‌ సీపీ నేతలు కుల, మత, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించేలా మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు విడుదలకు సిధ్ధమవుతోంది - డబ్బింగ్ షురూ

Srivishnu: అల్లు అరవింద్ ప్రజెంట్స్ లో శ్రీ విష్ణు హీరోగా #సింగిల్ చిత్రం

ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం

Gowtam: మహేష్ బాబు కుమారుడు గౌతమ్ నటుడిగా కసరత్తు చేస్తున్నాడు (video)

Sapthagiri: హీరో సప్తగిరి నటించిన పెళ్లి కాని ప్రసాద్ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

తర్వాతి కథనం
Show comments