Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీగలాడితే డొంక కదులుతోందా? అచ్చెంనాయుడు కేసు తిరుపతిలోను?

Webdunia
శుక్రవారం, 12 జూన్ 2020 (21:19 IST)
2015 సంవత్సరం నుంచి టిడిపి హయాంలో ఉన్న సమయంలో కార్మిక శాఖామంత్రిగా అచ్చెంనాయుడు పనిచేశారు. ఆ సమయంలో ఇఎస్ఐ ఆసుపత్రికి సంబంధించి కుంభకోణం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఆ విచారణలో భాగంగా ఈరోజు ఉదయం అచ్చెంనాయుడును అరెస్టు చేశారు.
 
అయితే అచ్చెంనాయుడు అరెస్టు తరువాత తిరుపతిలోను మాజీ అధికారులను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఎసిబి అధికారులు. టిడిపి హయాంలో ఇస్ఎస్ఐ ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన రమేష్ కుమార్‌తో పాటు వైద్యుడిగా ఉన్న జనార్థన రావులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 
 
ఒక హైడ్రామా తిరుపతిలో నెలకొంది. తెల్లవారుజామున తిరుపతికి వచ్చిన విజయవాడ ఎసిబి ప్రత్యేక బృందం సరిగ్గా 9 గంటలకు అవిలాలోని రమేష్ కుమార్ ఇంటిక వెళ్ళారు. అక్కడ అయన్ను అదుపులోకి తీసుకుని అదే కారులో ఎయిర్ బైపాస్ రోడ్డుకు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న వైద్యుడు జనార్థన్ రావును కారులో ఎక్కించుకుని విజయవాడకు తీసుకెళ్ళిపోయారు.
 
తిరుపతిలో ఇఎస్ ఐ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గా పనిచేసిన రమేష్ కుమార్ విజయవాడలో పదోన్నతి మీద డైరెక్టర్ గా వెళ్ళారు. అప్పట్లో జరిగిన కుంభకోణంలో రమేష్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారన్నది ఎసిబి విచారణలో వెల్లడైంది. దీంతో విజయవాడలోనే విచారణ జరిపేందుకు తిరుపతి నుంచి తీసుకెళ్ళారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments