Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తప్పు చేసే వారిని ఉపేక్షించరాదు : అచ్చెన్న అరెస్టుపై బీజేపీ నేతలు

Advertiesment
తప్పు చేసే వారిని ఉపేక్షించరాదు : అచ్చెన్న అరెస్టుపై బీజేపీ నేతలు
, శుక్రవారం, 12 జూన్ 2020 (15:13 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారం ఇపుడు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ఈ అరెస్టును బీజేపీ మినహా మిగిలిన విపక్ష పార్టీలకు చెందిన నేతలు ఖండిస్తున్నారు. కానీ, బీజేపీ నేతలు మాత్రం.. తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.
 
తాజాగా బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పందిస్తూ, అవినీతికి పాల్పడితే శిక్ష అనుభవించాల్సిందేనని, ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడి పాత్రపై సరైన ఆధారాలు ఉంటే విచారణ జరగాల్సిందేనని అన్నారు.
 
పక్కా ఆధారాలు ఉన్నప్పుడు ఇలాంటి అరెస్టులను ఎవరూ తప్పుబట్టబోరని స్పష్టం చేశారు. అవినీతి ప్రక్షాళన అనేది ప్రజాస్వామ్యంలో తక్షణ అవసరమని ఉద్ఘాటించారు. 
 
గతంలో వైసీపీ అధికారంలో లేనప్పుడు 'ఎంపరర్ ఆఫ్ కరప్షన్' అంటూ ఓ పెద్ద పుస్తకం వేశారని, అయితే అందులోని అంశాలపై ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని వ్యాఖ్యానించారు. ఆ పుస్తకంలో జీవోలతో సహా అవినీతి ఆరోపణలు చేశారని, ఇప్పుడదే వైసీపీ అధికారంలో ఉందని, చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలని అన్నారు.
 
అలాగే, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులను ఉపేక్షించరాదని అన్నారు. అవినీతి ఎవరు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. 
 
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి నేతల భరతం పడతామని ఎన్నికల ముందు చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు తన మాట నిలబెట్టుకోవాలని, ప్రస్తుతం ఇసుక మాఫియాకు పాల్పడుతున్న వారిపైనా కేసులు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ బారి నుండి తప్పించుకున్న 9 దేశాలు