డిఎస్పీనా మజాకా, త్రవ్వేకొద్దీ అక్రమాస్తులు

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (22:13 IST)
ఆయన సాధారణ డిఎస్పీ. రాష్ట్రంలో పలుచోట్ల విధులు నిర్వర్తించాడు. అయితే అక్రమాస్తులు కూడా బాగా కూడబెట్టాడు. తాను పోలీసే కదా తనను ఎవరు పట్టుకుంటారని అనుకున్నాడు. కానీ ఎసిబికి అడ్డంగా దొరికిపోయాడు. 4 కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించి ఎసిబి స్వాధీనం చేసుకుంది.
 
తిరుపతిలోని బైరాగిపట్టడెలో నివాసముండే డిఎస్పీ శంకర్ గత మూడురోజుల క్రితమే కాకినాడ థర్డ్ బెటాలియన్ డిఎస్పీగా బదిలీ అయ్యాడు. అంతకుముందు తిరుపతిలోని ఇంటిలిజెన్స్, లా అండ్ ఆర్డర్ డిఎస్పీగా పనిచేశాడు. అలాగే తిరుపతిలోను పలు పదవుల్లో పనిచేశాడు.
 
ఎస్ఐగా తన కెరీర్‌ను ప్రారంభించి డిఎస్పీ పదవికి వెళ్ళిన శంకర్ కేసులను తారుమారు చేయడం.. ఫిర్యాదుదారులను భయపెట్టడం... ఇలా చాలా రకాల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎసిబికి ఫిర్యాదు చేశారు బాధితులు. బాధితుల పిర్యాదుతో ఎసిబి రంగంలోకి దిగి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు శంకర్ ఇంట్లో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.
 
మొత్తం 4 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించారు. వందల ఎకరాల స్థలాలను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొనుగోలు చేయడం.. కోళ్ళ ఫారాలను ఏర్పాటు చేయడం.. అలాగే తన చెల్లెలు, బావమరుదలు పేర్లు మీద ఆస్తులు కొనడం గుర్తించిన ఎసిబి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 కు లాబాలు వచ్చినా ప్రొడ్యూసర్స్ కు అనుకోని ఆటంకాలు

ప్రేమించి మోసం చేసేవాళ్ళకు పుట్టగతులుండవ్ : నటి ఇంద్రజ శాపనార్థాలు

అఖండ-2 కష్టాలు ఇంకా తీరలేదు.. త్వరలో కొత్త రిలీజ్ తేదీ

Shiv Rajkumar: ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్‌‌లో నటించేందుకు సిద్ధం

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments