Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితురాలి తండ్రితో శారీరక సంబంధం, బాగా వాడుకున్న తరువాత?

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (20:03 IST)
వారిద్దరిది విజయవాడలోని మానసపురం. పక్కపక్కన ఇళ్ళే. ఇద్దరూ బి.టెక్ పూర్తి చేశారు. జాబ్ సెర్చింగ్‌లో ఉన్నారు. రెండు నెలలుగా ఉద్యోగం కోసం తిరిగి తిరిగి బాగా అలసిపోయారు. ఒకరు గీత, మరొకరు భావన. భావన తల్లి అనారోగ్యంతో ఐదు సంవత్సరాల క్రితమే చనిపోయింది. తండ్రి రామరాజు రియల్ ఎస్టేట్ వ్యాపారి. బాగానే సంపాదించాడు.
 
ఒక్కగానొక్క కూతురిని బాగా చూసుకునేవాడు రామరాజు. కుమార్తెకు పెళ్ళి చేసి పంపించాలని అనుకున్నాడు రామరాజు. అయితే ఇప్పుడే తనకు పెళ్ళి వద్దని.. ఉద్యోగం చేయాలని పట్టుబట్టీ మరీ ఉద్యోగ వేట కొనసాగిస్తోంది భావన. ఉద్యోగం కోసం భావన.. గీత కలిసి తిరగడంతో ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. దీంతో భావన ఇంటికి గీత రావడం ప్రారంభించింది.
 
అయితే గీత అందానికి రామరాజు పడిపోయాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్నాడు. గీత ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఆమెకు కొత్త సెల్ ఫోన్లు, కొత్త బట్టలు ఇలా ఆమెకు కావాల్సిందంతా కొనివ్వడం ప్రారంభించాడు. ఇలా ఆమెను మెల్లగా లొగదీసుకున్నాడు. శారీరకంగా ఇద్దరూ ఒకటయ్యారు కూడా. 
 
అయితే వారంరోజుల క్రితం గీత తనకు కుటుంబ సభ్యులు పెళ్ళి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే రెండు, మూడు సంబంధాలు వచ్చాయని.. మన మధ్య ఇక నుంచి ఈ బంధం ఆపేద్దామని చెప్పింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు రామరాజు. పెళ్ళిచూపులు వాయిదా వేయమని.. ఇప్పట్లో పెళ్ళి వద్దని చెప్పే ప్రయత్నం చేశాడు. రామరాజు కోపంతో ఉండడంతో మొదటిసారి చూసింది గీత.
 
తన తల్లిదండ్రులను కాదని.. రామరాజుతో శారీరక సంబంధాన్ని కొనసాగించడం గీతకు ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో రామరాజును చంపేయాలనుకుని ప్లాన్ చేసింది. ఆ ప్లాన్‌లో భాగంగా రెండు రోజుల క్రితం విజయవాడ శివార్లలోని ఎస్టేట్ సమీపానికి రమ్మని రామరాజుకు ఫోన్ చేసింది. రామరాజు అక్కడకు వెళ్ళాడు. ఇద్దరూ కలిసి కూల్‌డ్రింక్స్ తాగారు. కాసేపు ముచ్చటించారు. అయితే ఉన్నట్లుండి గీత తన పర్సులోని మత్తుమందును రామరాజు ముఖంపై చల్లింది. తన వెంట తెచ్చుకున్న కత్తితో అతని మెడను కోసింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో చనిపోయాడు రామరాజు.
 
ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయింది గీత. తన ఫోన్ స్విచాఫ్ చేసేసింది. అయితే పోలీసులు విచారణ ప్రారంభించడం.. రామరాజు మొబైల్‌కు ఎక్కువసార్లు గీత మాట్లాడటం పోలీసులకు అనుమానం వచ్చింది. పరారీలో ఉన్న గీతను నిన్న సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటపడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments