రౌడీషీటర్ హత్య.. కత్తితో పీక కోసి పరారైనారు.. గొడవలే కారణం..

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2022 (10:00 IST)
విశాఖపట్టణంలో రౌడీషీటర్ హత్యకు గురైయ్యాడు. అతడి స్నేహితులే నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే... విశాఖ అప్పుఘర్‌కు చెందిన బి.అనిల్‌కుమార్ (36), ఎంవీపీ కాలనీలోని ఆదర్శనగర్‌కు చెందిన శ్యామ్‌ప్రకాశ్ స్నేహితులు. 
 
అనిల్ కుమార్ రౌడీ షీటర్ కాగా.. శ్యామ్ ప్రకాశ్ బస్సు డ్రైవర్. ఈ ఇద్దరిపై కేసు వుంది. గతంలో ఒకసారి క్రికెట్ ఆడుతున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరగింది. 
 
ఆ తర్వాత రాజీ కుదర్చడంతో మళ్లీ స్నేహితులయ్యారు. కానీ బార్‌లో మద్యం తాగుతూ ఏర్పడిన గొడవలో శ్యామ్ ప్రకాశ్ మరో స్నేహితుడితో కలిసి అనిల్‌పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో అతడి పీక కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు.
 
కాగా, అనిల్ కుమార్ తనను తక్కువ చేసి హేళనగా మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకే శ్యామ్ ప్రకాశ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. అతడిని హత్య చేసే ఉద్దేశంతోనే బార్‌కు తీసుకెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రధాన నిందితుడు శ్యామ్ ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మిగిలిన వారు పరారీలో వున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments