Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందయ్య మందుపై 27న హైకోర్టులో విచారణ.. జగపతిబాబు మద్దతు

Webdunia
మంగళవారం, 25 మే 2021 (18:04 IST)
ఆనందయ్య మందు పంపిణీ చేయాలని దాఖలైన రెండు పిటిషన్ల విచారణకు అనుమతించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఈ నెల 27న హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేయనుంది. ప్రభుత్వం మందు పంపిణీకి ఖర్చులు, ఇతర సౌకర్యాలు కల్పించాలన్న పిటిషనర్లు… శాంతి భద్రతల సమస్య లేకుండా చూడాలి అని హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు. లోకాయుక్తా ఆదేశాల ప్రకారం మందు పంపిణీ అపారని పోలీసులు చెబుతున్నారని హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు.
 
లోకాయుక్తకి ఆ అధికారం లేదన్న పిటిషనర్… మందు పంపిణీ ఆపాలని అసలు లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదని కోర్ట్ కి వివరించారు. ఇక ఆనందయ్య మందు విషయంలో ఆయుష్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఏ విధమైన హానికారకాలు లేవు అని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌లో కూడా పరిశోధనలు చేసారు. 
 
ఇదిలా ఉంటే.. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఇస్తున్నా నాటు మందుకు చాలామంది మద్దతు ఇస్తున్నారు. తాజాగా నేపథ్యంలోనే ప్రముఖ నటుడు జగపతిబాబు కూడా ఆనందయ్యకు సపోర్ట్‌గా నిలిచాడు. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఆనందయ్య‌ను సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశాడు. 
jagapathi babu
 
"ఆనందయ్యను చూస్తుంటే తల్లి ప్రకృతి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందనిపిస్తోంది. ఆనందయ్య గారి వైద్యానికి అధికారిక అనుమతి రావాలని ప్రార్థిస్తున్నాను. అదే ఈ ప్రపంచాన్ని కాపాడాలి. ఆ విధంగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాలి అంటూ.." జగపతిబాబు ట్వీట్ చేశారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments