Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, ఆనందయ్యను ఔషధం మంచిది: నారాయణ

దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి, ఆనందయ్యను ఔషధం మంచిది: నారాయణ
, సోమవారం, 24 మే 2021 (22:19 IST)
అమ్మా పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్న చందంగా తయారైంది ఎపి రాష్ట్రప్రభుత్వ పరిస్థితి. ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరతతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుంటే ఆనందయ్య తయారుచేసిన ఔషధాన్ని పంపిణీ చేసుకోవాలని ఆదేశాలివ్వాల్సింది పోయి అడ్డంకులు సృష్టిస్తారా అంటూ మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్సి నారాయణ. ఇప్పటికైనా ఆనందయ్యను ఔషధాన్ని పంపిణీ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
 
ఆనందయ్య వాడే మూలికల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండబోదన్నారు. జనంలో ఆనందయ్య మందుపై నమ్మకం పెరిగిందని.. ఆనందయ్య తయారుచేస్తన్న మందుపై దుష్ప్రచారం మానాలన్నారు. రాష్ట్రప్రభుత్వం కరోనాను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని.. కరోనా సమయంలో కక్ష సాధింపులు సీఎం జగన్‌కు అవసరమా అంటూ ప్రశ్నించారు.
 
ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరతతో జరుగుతున్న మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. సొంత ఎంపిని అరెస్టు చేయించడం హాస్యాస్పదమని.. కరోనా సమయంలో కక్ష సాధింపులు జగన్‌కు అవసరమా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోడీ చేతకానితనంతో కరోనా మృతుల సంఖ్య దేశంలో రోజు రోజుకు పెరుగుతోందని.. బంగ్లాదేశ్, పాకిస్థాన్ లాంటి దేశాల్లో వైద్య, ఆరోగ్య శాఖ పటిష్టంగా పనిచేస్తోందన్నారు. మనదేశంలోనే వైద్య, ఆరోగ్య శాఖ సక్రమంగా పనిచేయడం లేదంటూ ఆరోపించారు.
 
దేశంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని..కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో విజయవాడలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని..అలాగే ఎపిలిఓని 13జిల్లాలలోని సిపిఐ కార్యాలయంలో కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ను ఏర్పాటు చేసి కరోనా రోగులకు తమ వంతు సహాయం చేస్తామన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కియా మోటార్స్ ఇండియా.. ఇక కియా ఇండియాగా పేరు మార్పు