Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళి చేసుకుని ప్రియుడితో డేటింగ్.. ఆ తర్వాత? (Video)

కని పెంచిన పేగు బంధాన్ని కాదనుకుంది. మూణ్ణాళ్ల పరిచయాన్ని గొప్పగా భావించి ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. అలాగని పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారా... అదీ లేదు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి

Webdunia
శనివారం, 17 ఫిబ్రవరి 2018 (19:19 IST)
కని పెంచిన పేగు బంధాన్ని కాదనుకుంది. మూణ్ణాళ్ల పరిచయాన్ని గొప్పగా భావించి ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. అలాగని పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారా... అదీ లేదు. పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి ఒకటిన్నర సంవత్సరంగా సహజీవనం చేస్తున్నారు.  
 
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పోటు కనుమ గ్రామానికి చెందిన స్వాతికి అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడికి ఇచ్చి మూడు సంవత్సరాల ముందు వివాహం చేశారు. తిరుపతిలోని జీవకోనలో భార్యాభర్తలు కాపురం పెట్టారు. ఒకటిన్నర సంవత్సరం పాటు బాగానే వున్నా ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో విడిపోవాలనుకున్నారు భార్యాభర్తలు. ఇంతలో స్వాతికి తనతో షాపులో పనిచేసే ఒక యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు చెప్పకుండానే ఇంటి నుంచి వచ్చేసిన స్వాతి ప్రియుడితో కలిసి ఒకటిన్నర సంవత్సరంగా సహజీవనం చేస్తోంది.
 
రాజేష్ బంధువులు స్వాతి కోసం వెతికినా  ఫలితం లేకుండా పోయింది. శనివారం ఉదయం స్వాతి స్కూటర్ పైన వెళుతుండగా రాజేష్ బంధువు ఒకరు చూసి వెంబడించారు. రైల్వే కాలనీలోని ఒక గదిలో ప్రియుడితో కలిసి స్వాతి ఉన్న విషయాన్ని తెలుసుకుని రాజేష్ బంధువులందరూ అక్కడకు చేరుకున్నారు. స్వాతిని చితకబాదారు. అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా సరే స్వాతి మాత్రం తన ప్రియుడితోనే కలిసి ఉంటానని చెబుతోంది. చూడండి వీడియో...

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments