Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్ను ఎస్సై పిలుస్తున్నాడంటూ తీసుకెళ్లి యువతిపై అత్యాచారం

Webdunia
శనివారం, 29 మే 2021 (11:49 IST)
ఒంగోలులో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఎస్సై పిలుస్తున్నాడని చెప్పి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
వివరాలు ఇలా వున్నాయి. ఒంగోలు కొత్తమామిడి పల్లికి సమీపంలో ఓ యువతి తన స్నేహితుడితో కలిసి బయటకు వచ్చింది. ఆ తర్వాత సాయంత్రం అక్కడి నుంచి ఒంటరిగా ఇంటికి వెళుతుండగా ఆమెను అనుసరిస్తూ వచ్చిన ఓ కామాంధుడు ఆమెని అడ్డగించి, నీ స్నేహితుడితో నువ్వు క్లోజ్‌గా వున్న ఫోటోలు నా దగ్గర వున్నాయనీ, వాటిని నీ తల్లిదండ్రులకు చూపుతానంటూ బెదిరించాడు.
 
అందుకు ఆ యువతి నేనేమీ తప్పు చేయలేదంటూ ధైర్యంగా సమాధానం చెప్పేసరికి ప్లేటు ఫిరాయించాడు. వెంటనే నిన్ను ఎస్సైగారు తీసుకుని రమ్మన్నారంటూ బెదిరించి తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకున్నాడు. ఆమెను ఊరు బయట శివారు ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఆ తర్వాత ఆమెను మళ్లీ తిరిగి తీసుకుని వచ్చి ఆమె వుంటున్న ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని తన స్నేహితురాళ్లతో యువతి చెప్పడంతో వారు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జవాన్‌ చిత్రానికి రాష్ట్రపతి నుంచి జాతీయ అవార్డు తీసుకున్న షారుఖ్ ఖాన్‌

Chittibabu: శోభన్ బాబు ఫ్యాన్ కొంటే ఓనర్ వచ్చి తీయించేశాడు : చిట్టిబాబు

OG: ఉత్తరాంధ్రలో దిల్ రాజు కాంబినేష న్ తో OG విడుదల చేస్తున్న రాజేష్ కల్లెపల్లి

శివరాజ్ కుమార్ కుటుంబంతో ప్రత్యేక సమావేశం అయిన మంచు మనోజ్

Allari Naresh: అల్లరి నరేష్ ఆవిష్కరించిన విద్రోహి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

Navratri Snacks: నవరాత్రి స్నాక్స్.. సగ్గుబియ్యం టిక్కా.. అరటి పండ్ల చిప్స్ సింపుల్‌గా..

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

తర్వాతి కథనం
Show comments