Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకుంటానని లొంగదీసుకున్నాడు... రూ.45 లక్షలు తీస్కుని జంప్

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (10:40 IST)
ఫేస్ బుక్‌లో ఇద్దరి మధ్యా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. చివరకు సహజీవనం వరకు వెళ్ళింది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగన్నరేళ్ళు ప్రియుడితో కలిసి సహజీవనం చేసింది. ప్రియుడిని నమ్మి 45 లక్షలు రూపాయలు ఇచ్చింది. ఇంకేముంది పెళ్ళి మాట వచ్చేసరికి ముఖం చాటేశాడు. కనిపించకుండా పారిపోయాడు. దీంతో లబోదిబోమంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
 
ప్రకాశం జిల్లాకు చెందిన అరవింద్ కు నల్గొండజిల్లా నల్గొండ నగరానికి చెందిన సహస్రకు మధ్య ఫేస్ బుక్ ద్వారా నాలుగున్నరేళ్ళ క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది. ప్రేమిస్తున్న యువకుడు పెళ్ళి చేసుకుంటాడన్న నమ్మకంతో సర్వస్యం అప్పజెప్పింది. 
 
నాలుగున్నరేళ్ళు ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. అంతేకాదు ప్రియుడిని నమ్మి తన ఆస్తి అమ్మి 45 లక్షల రూపాయలు కూడా ఇచ్చింది. తన తల్లి అనారోగ్యంతో ఉన్నా పట్టించుకోకుండా ప్రియుడు అరవిందే సర్వస్వం అని భావించింది సహస్ర.
 
చివరకు పెళ్ళి చేసుకుంటాడని నమ్మింది. కానీ అరవింద్ మాత్రం పెళ్ళి చేసుకోనని ముఖం మీద చెప్పేశాడు. దీంతో టంగుటూరు పోలీసులను ఆశ్రయించింది. అయినా ఉపయోగం లేకుండా పోయింది. రాజకీయ ఒత్తిళ్ళలో అరవింద్ పై కేసు నమోదు చేయలేదు. అరవింద్ ఇంటి ముందు బైఠాయించింది. అరవింద్ ఇంటికి తాళాలు వేసి ఎక్కడికో పారిపోయాడు. దీంతో సహస్ర లబోదిబోమంటూ మీడియాను ఆశ్రయించింది. న్యాయం జరుగకుంటే ఆత్మహత్యే శరణ్యమంటోంది సహస్ర.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందిన ఫైటర్ శివ టీజర్ ఆవిష్కరించిన అశ్వనీదత్

ధర్మశాల వంటి ఒరిజనల్ లొకేషన్ లో పరదా చిత్రించాం : డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments