Cobra: పుట్టపై నాగుపాము ప్రత్యక్షం.. భయం లేకుండా పూజలు చేసిన భక్తులు (video)

సెల్వి
సోమవారం, 27 అక్టోబరు 2025 (22:25 IST)
snake
నాగుల చవితిని పురస్కరించుకుని నాగుపాములు తెలుగు రాష్ట్రాల్లో పుట్ట నుంచి బయటికి వచ్చి దర్శనమిస్తున్నాయి. పుట్టలో భక్తులు పాలుపోయడంతో దానిని తాగేందుకు ఓ పాము బయటికి రావడం, శివలింగానికి ఇరువైపులా నాగుపాములు పడగవిప్పి దర్శనం ఇచ్చిన వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను పాములకు దూరంగా వుంటూ భక్తులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 
 
అయితే తాజాగా ఓ నాగుపాముకు ప్రత్యక్షంగా పూజలు చేశాడు ఓ భక్తుడు. పడగ విప్పి పుట్ట నుంచి బయట నిల్చుని వున్న పాముకు శ్రద్ధతో ఓ భక్తుడు పూజలు చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. 
 
కార్తీక మాసం నేపథ్యంలో స్థానిక పెరంపేట రోడ్డులోని బాట గంగానమ్మ ఆలయ సమీపంలో వేప చెట్టు వద్ద నాగుపాము ప్రత్యక్షం అయ్యింది  దీంతో నేరుగా పాముకే భక్తులు పూజలు చేశారు. 
 
అయితే ఈ పాము వారిని చూసి పడగ విప్పింది. ఏమాత్రం బుసలు కొట్టకుండా నెమ్మదిగా వారు చేసే పూజలు చూస్తుండి పోయింది. ఈ వీడియో వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments