Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏఓబీలో మళ్లీ కాల్పుల మోత

Webdunia
మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (05:44 IST)
ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లో మరోసారి తుపాకీ చప్పుడైంది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో నిన్న ముగ్గురు మావోలు మృతి చెందారు. ఈ నేపథ్యంలో.. ఇవాళ మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి.

విశాఖ జిల్లా గూడెంకొత్త వీధి మండలం గుమ్మిరేవుల వద్ద మరోసారి పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అటవీప్రాంతంలో దాదాపు 20 నిమిషాలపాటు తుపాకుల శబ్దాలు వినిపించాయి. నిన్నటి ఎదురుకాల్పుల్లో ముగ్గురు మవోలు మృతి చెందారు. మరి కొందరు అడవిలోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసు బలగాలకు.. మావోయిస్టులు తారసపడిన సందర్భంలో.. మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మరికొంతమంది మావోయిస్టులు గాయపడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కొన్ని ఆయుధాలను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు నిన్న మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు అటవీ ప్రాంతం నుంచి రహదారి మార్గానికి తీసుకువచ్చారు. వారిని చత్తీస్​గఢ్​కు చెందిన అజయ్, బుద్రి, బిమ లుగా గుర్తించారు. ఈ మృతదేహాలకు నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments