Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతిని నరికి.. ముఖంపై చర్మం ఒలిచి... రెండు కళ్లను పీకేసి... విద్యార్థి దారుణ హత్య...

అనంతపురం జిల్లా హిందూపురం మండలం కొటిపి గ్రామంలో దారుణం జరిగింది. ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. అదీకూడా చేతిని నరికి, ముఖంపై చర్మాన్ని ఒలిసి అత్యంత దారుణంగా హత్య చేశారు.

Webdunia
మంగళవారం, 14 ఆగస్టు 2018 (10:25 IST)
అనంతపురం జిల్లా హిందూపురం మండలం కొటిపి గ్రామంలో దారుణం జరిగింది. ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. అదీకూడా చేతిని నరికి, ముఖంపై చర్మాన్ని ఒలిసి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ హృదయ విదారక ఘటన వివరాలను పరిశీలిస్తే..
 
కొటిపి గ్రామానికి చెందిన నాగరాజు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. నాగరాజు ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈయన చిన్నకుమారుడైన నవీన్‌(13) స్థానికంగా ఉండే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. 
 
శుక్రవారం సాయంత్రం తండ్రి పనిచేస్తున్న పరిశ్రమ వద్ద ద్విచక్ర వాహనానికి పంక్చర్‌ వేయించుకుని వస్తానంటూ వెళ్లిన నవీన్‌ రాత్రయినా తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో నవీన్‌ శవమై కనిపించాడు. దుండగులు అతడి చేతిని భుజం వరకు నరికేశారు. మొహంపై చర్మం ఒలిచి, రెండు కళ్లను పీకేసిన ఆనవాళ్లున్నాయి. ఎక్కడో హత్య చేసి, సోమవారం తెల్లవారుజామున ఇక్కడకు తీసుకొచ్చి పడేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments