జగన్ హయాంలో అక్రమాలు.. ఒక్కొక్కటీ వెలుగులోకి.. 76 వైసీపీ ఎస్ఎం వర్కర్లకు...?

సెల్వి
బుధవారం, 19 జూన్ 2024 (10:35 IST)
వైకాపా చీఫ్ జగన్ సీఎంగా గత ప్రభుత్వం చేసిన అక్రమాలు అంటూ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ) కార్యాలయాన్ని కూడా దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
ఏపీఎస్ఎస్‌డీసీ వారు కార్పొరేషన్‌లో పని చేయనప్పటికీ డెబ్బై ఆరు మంది ఉద్యోగులకు ఐదేళ్లపాటు జీతాలు చెల్లించారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మారడంతో సంస్థలో జరుగుతున్న అవినీతిపై ఉద్యోగులు పెదవి విప్పుతున్నారు. ఈ డెబ్బై ఏడు మంది ఉద్యోగులు వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.
 
ఏపీఎస్ఎస్‌డీసీ ప్రజల సొమ్మును జీతాల రూపంలో చెల్లించారన్నది ఆరోపణ. కాగా చల్లా మధుసూధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు. 2021లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ) ఛైర్మన్‌గా, రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధికి సలహాదారుగా నియమించబడ్డారు. 
 
జర్మన్ ప్రాజెక్ట్‌ను కొనసాగించడానికి, బిల్లు క్లియరెన్స్ కోసం ఆయన 30 లక్షల రూపాయల కమీషన్ తీసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా విభాగానికి నిధుల మళ్లింపు, అక్రమాలకు సంబంధించి ఆయన విచారణలో పడ్డారు.
 
ఏపీఎస్ఎస్‌డీసీ నుండి లబ్ది పొందిన ఈ సోషల్ మీడియా వర్కర్లలో చాలా మంది ఇప్పటికే తమ ఖాతాలను డియాక్టివేట్ చేసారు. సోషల్ మీడియా నుండి పారిపోయారు. వీరిలో కొందరు న్యాయవ్యవస్థ దుర్వినియోగంలో గతంలో అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments