Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడు కొండలు.. ఏడు బ్రాండులు...టిటిడి అగరబత్తులు ఇవే!

Webdunia
బుధవారం, 8 సెప్టెంబరు 2021 (13:25 IST)
తిరుమ‌ల‌లో ఏడు కొండలు... టిటిడిలో త‌యార‌వుతున్న అగ‌బ‌త్తులు కూడా ఏడు బ్రాండులు... 
1. అభ‌య‌హ‌స్త 2. తంద‌నాన 3. దివ్య‌పాద 4. ఆకృష్టి 5. సృష్టి 6. తుష్టి 7. దృష్టి
 
తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో ప‌రిమ‌ళాలు వెదజల్లే అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి భ‌క్తుల‌కు అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. శ్రీనివాసుని ఏడుకొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్ల‌తో ఈ అగరబత్తులు తీసుకొస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది.  సెప్టెంబ‌రు 13 నుంచి వీటి విక్రయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. 
 
తితిదే ఆలయాల్లో పూజ‌లు, అలంక‌ర‌ణ‌ల‌కు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. ప‌ర్వ‌దినాలు, ఉత్స‌వాల స‌మ‌యంలో అయితే పుష్పాల వినియోగం మ‌రింత అధికంగా ఉంటుంది. దేవతామూర్తులకు ఉప‌యోగించిన పుష్పాల‌న్నీ మ‌రుస‌టిరోజు ఉద‌యం తొల‌గిస్తారు. దీంతో స్వామివారి సేవ‌కు వినియోగించిన ఈ  పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉప‌యోగించే విష‌యంపై తితిదే బోర్డు వినూత్న ఆలోచన చేసింది. ఈ క్రమంలో బెంగ‌ళూరు కేంద్రంగా పనిచేస్తున్న ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ తితిదే ఆల‌యాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాల‌ను అందిస్తే లాభంతో సంబంధంలేకుండా అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఆ సంస్థ‌తో తితిదే అవగాహన కుదుర్చుకొని ఎస్వీ గోశాల‌లో అగ‌ర‌బ‌త్తుల త‌యారీకి అవ‌స‌ర‌మైన స్థ‌లం కేటాయించింది. ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ సొంత ఖ‌ర్చుతో యంత్రాలు, సిబ్బందిని నియ‌మించుకుని కొన్ని రోజులుగా ప్ర‌యోగాత్మ‌కంగా అగ‌ర‌బ‌త్తుల ఉత్ప‌త్తిని ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments