Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేత గంజి ప్రసాద్ హత్య కేసు: ఆరుగురి అరెస్టు

Webdunia
బుధవారం, 4 మే 2022 (18:04 IST)
ఏలూరు జిల్లా జి.కొత్తపల్లి మండలం గోపాలపురం గ్రామంలో వైకాపా నేత గంజి ప్రసాద్ హత్య కేసులో పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు. ఈ హత్య కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా, వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
 
ఇటీవల ఏపీలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు హస్తమున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గంజి ప్రసాద్ మృతదేహానికి నివాళులు అర్పించేందుకు వెళ్లిన వైకాపా ఎమ్మెల్యేపై గంజి ప్రసాద్ అనుచరులు, గ్రామస్థులు దాడి చేశారు. ఈ దాడి పెను సంచలనంగా మారింది. 
 
ఈ నేపథ్యంలో ఈ కేసులో సంబంధం ఉన్నవారిలో ఆరుగురిని అరెస్టు చేశారు. గంజి ప్రసాద్ హత్యకేసులో ముగ్గురు స్వయంగా పాలుపంచుకోగా, వారిని బజారయ్య అనే వ్యక్తి ప్రోత్సహించారని జిల్లా ఎస్పీ తెలిపారు. దీంతో బజారయ్యతో పాటు సురేశ్, మోహన్ కుమార్, హేమంత్, గంజి నాగార్జున, రెడ్డి సత్యనారాయణలను అరెస్టు చేసినట్టు ఆయన వెల్లడించారు. గంజి ప్రసాద్ రాకపోకలపై గంజి నాగార్జున రెక్కీ నిర్వహించగా, సురేశ్, హేమంత్‌లు గంజి ప్రసాద్‌పై బైకుపై వెంబడించి హత్య చేశారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments