Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు: నిందితుడు శివకృష్ణను చనిపోయేవరకూ ఉరి తీయండి

court
, శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (21:54 IST)
గత ఏడాది ఆగస్టు 15న అత్యంత దారుణంగా ప్రేమోన్మాది శివకృష్ణ, బీటెక్ విద్యార్థిని రమ్యను కత్తితో పొడిచి హత్య చేసాడు. పట్టపగలే అందరూ చూస్తుండగా ఆమెను పాశవికంగా పొట్టనబెట్టుకున్నాడు. ఈ కేసుపై గత ఏడాది డిశెంబరు నెల నుంచి కోర్టులో విచారణ ప్రారంభమై ఈ నెల 26తో ముగిసింది.

 
గుంటూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధిస్తూ... స్వాతంత్ర దినోత్సవం నాడు పట్టపగలే అందరూ చూస్తుండగా విద్యార్థినిని నిందితుడు హత్య చేసాడనీ, ఇంత దారుణం చేసినా అతడిలో ఎలాంటి మార్పు రాకపోగా కోర్టు నుంచి పారిపోయే ప్రయత్నం చేసాడని వ్యాఖ్యానించారు. తప్పు చేసానన్న భావన అతడిలో ఎంతమాత్రం కనిపించడంలేదనీ, ఇతడికి మరణశిక్ష సరైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు.

 
ఈ కేసులో హత్యకు గురైన రమ్యకు శివకృష్ణ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యాడు. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని తనను ప్రేమించాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు తాళలేక అతడి ఫోన్ నెంబరును బ్లాక్ చేసింది. దీనితో ఆ ప్రమోన్మాది గుంటూరులో పట్టపగలే నడిరోడ్డుపై ఆమెను కత్తితో పొడిచి హత్య చేసాడు. సీసీ కెమేరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితుడిని పోలీసులు 24 గంటలు గడవకముందే నరసరావుపేటలో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ సచివాలయానికి పెయింట్ భాగస్వామిగా ఎంపికైన నిప్పన్ పెయింట్