Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు జనరల్ బోగీలో స్టౌవ్‌లో కోట్ల రూపాయల విలువ చేసే బంగారం... నెల్లూరులో....

నెల్లూరు జిల్లాలోని రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గౌహతి నుంచి చెన్నైకి వెళుతున్న రైలులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఒక ప్రయాణికుడు కనిపించాడు. అది కూడా జనరల్ బోగీలో ఏమీ ఎరుగనట్లు ఒక అల్యూమినియం స్ట

Webdunia
సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (20:23 IST)
నెల్లూరు జిల్లాలోని రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. గౌహతి నుంచి చెన్నైకి వెళుతున్న రైలులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఒక ప్రయాణికుడు కనిపించాడు. అది కూడా జనరల్ బోగీలో ఏమీ ఎరుగనట్లు ఒక అల్యూమినియం స్టౌవ్ పట్టుకుని, తలపైన సామాన్లు ఉంచుకుని నిలబడ్డాడు ఆ ప్రయాణీకుడు. ఇంటి సామానుగా భావించి రైల్వే పోలీసులు కొద్దిసేపు పట్టించుకోలేదు. అయితే జనరల్ బోగీ ఖాళీగా ఉన్నా ఆ వ్యక్తి లగేజ్‌ను కింద పెట్టకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
 
సామాన్లతో పాటు స్టౌవ్‌ను పరిశీలించారు రైల్వే పోలీసులు. అల్యూమినియం స్టౌవ్‌లో ఒకటిన్నర కోటి విలువైన బంగారం బయటపడింది. అది కూడా 5 కిలోల బంగారం. గౌహతి నుంచి చెన్నైకు ఈ బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. వెంటనే కస్టమ్స్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకొని 1962 కస్టమ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు డిఆర్ఐ అధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments