Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల హస్తం : మంత్రి నాదెండ్ల

వరుణ్
ఆదివారం, 14 జులై 2024 (12:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు అందించే రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలి వెల్లడంతో ఐదుగురు ఐపీఎస్‌లు తమ వంతు పాత్ర పోషించారని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన ఇటీవల కాకినాడలో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి చెందిన బియ్యం గోదాముల్లో తనిఖీ చేయగా, అక్రమంగా నిల్వవుంచిన వేల టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి, ఆ గోదాములను సీజ్ చేశారు. ఈ అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. 
 
కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ అక్రమ తరలింపులో ఐదుగురు ఐపీఎస్‌ల పాత్ర ఉందన్నారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో సామాన్యులకు నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 
 
ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ... ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హోల్ సేల్ దుకాణదారులు, రిటైల్ వర్తకులు కూడా రూ.160కే నాణ్యమైన కిలో కందిపప్పును అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మున్ముందు పంచదార సహా పలు చిరుధాన్యాలను కూడా రైతు బజార్లలో రాయితీపై విక్రయిస్తామని తెలిపారు. ఒక్కొక్కరికి కిలో కందిపప్పు, 5 కిలోల బియ్యం చొప్పున అందిస్తామన్నారు. ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

జానీ మాస్టర్... మీరు దోషి అయితే... దానిని అంగీకరించండి : మంచు మనోజ్ ట్వసీట్

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు.. స్పందించేందుకు నిరాకరించిన భార్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments