Webdunia - Bharat's app for daily news and videos

Install App

367 మంది ఎల్.జి. పాలిమర్స్ బాధితులకి చికిత్స: మంత్రి కురసాల కన్నబాబు

Webdunia
మంగళవారం, 12 మే 2020 (20:50 IST)
ఎల్.జి. పాలిమర్స్ బాధితులు ఏ ఒక్కరూ తప్పిపోకుండా ఎన్యూమరేషన్ చేయిస్తున్నట్లు జిల్లా ఇన్ చార్జ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.  ఎల్.జి. పాలిమర్స్ స్టైరీన్ లీకేజి ఘటనకు గురై కె.జి.హెచ్.లో చికిత్సపొందుతున్న బాధితులను మంగళవారం ఆయన పరామర్శించారు. 

ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయి రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని, అందరూ సంయమనం పాటించాలన్నారు. 

ప్రస్తుతం 367 మంది చికిత్స పొందుతున్నారని, ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నవారిని 200 మంది వరకు ఆసుపత్రి నుండి విడుదల చేయనున్నట్లు చెప్పారు.  ముఖ్యమంత్రి ఆదేశాల పై ఈ రోజు ఆసుపత్రి నుండి పూర్తి ఆరోగ్యంతో విడుదలైన వారికి ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించి వారి స్వగృహాలకు పంపనున్నట్లు తెలిపారు. 

రాజ్యసభ సభ్యులు వి. విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కె.జి.హెచ్.లో 300 మంది చికిత్స పొందుతున్నారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 67 మంది ఉన్నారని, ఈ రోజు 200 మంది వరకు ఆరోగ్యంగా ఉన్నవారిని ఆసుపత్రి నుండి విడుదల చేస్తారని, వారి వారి గృహాలకు వెల్లేందుకు రవాణా సౌకర్యం కల్పించమని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పినట్లు తెలిపారు.  
 
మిగిలిన వారు చికిత్స పొందుతున్నారని, చికిత్స బాగా జరుగుతుందని తెలిపారు.  5 గ్రామాల్లో పరిస్థితి సాధారణ స్థాయికి వచ్చిందని, ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని, గ్రామాల్లో నివాస యోగ్యంగా ఉన్నదని, గ్రామస్తుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఆయా గ్రామాల్లోనే రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు రాత్రి బస చేసినట్లు వివరించారు. ఇప్పటికే గ్రామాల్లో ప్రజలు నివాసం ఉంటున్నట్లు వివరించారు.   

గ్రామాల ప్రజలకు వైద్య పరీక్షలు చేసేందుకు 5గురు వివిధ రంగాల వైద్యులు వెళ్ళి పరీక్షలు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలపై గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి పరిహారం అందించేందుకు ఎన్యూమరేషన్ జరుగుతోందన్నారు.  అంతకు ముందు కె.జి.హెచ్.లో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. 

పరామర్శించిన వారిలో రాష్ట్ర మంత్రులు కురసాల కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్య సభ సభ్యులు వి. విజయ సాయి రెడ్డి, విఎంఆర్డిఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాసరావు ఉన్నారు. రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి బాధితులను పరామర్శించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం బాధితులకు 25 వేల రూపాయల చెక్కులను ఆయన అందజేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, కె.జి.హెచ్. పర్యవేక్షకులు డా.జి. అర్జున్, ఎఎంసి ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments