Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలు నమ్మకండి: మంత్రి పేర్ని నాని

సోషల్ మీడియాలో వస్తున్న అసత్యాలు నమ్మకండి: మంత్రి పేర్ని నాని
, సోమవారం, 11 మే 2020 (21:30 IST)
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ఇళ్ల స్థలాల లే అవుట్‌ తయారు చేయడం, ప్లాట్లు విభజన, అర్హుల జాబితా ప్రచురణ  పూర్తయిందని, అయితే ఈ దశలో కొందరు మరోమారు ఇళ్లస్థలాలకు దరఖాస్తు చేసుకోమని అవాస్త సమాచారం సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని అటువంటి పుకార్లు నమ్మవద్దని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) స్పష్టం చేశారు. 
 
సోమవారం ఆయన తన కార్యాలయం వద్దకు వచ్చిన పలువురు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో కొందరు మరోమారు ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకోమని, ప్రభుత్వం మరో విడత ఇళ్ళ స్ధలాలు ఇవ్వనుందనే విషయం వార్త రూపంలో పలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న విషయాన్ని మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ, ఇటీవల జిల్లా కలెక్టర్లతో సమావేశమైన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పలు సూచనలు ఇచ్చారన్నారు.

ఇళ్లస్థలాల పొందేందుకు అర్హులైన లబ్ధిదారుల జాబితా ఆయా గ్రామాలలోని సచివాలయంలో నోటీసు బోర్డులలో అతికించాలని, ఆ లిస్ట్ లో గతంలోనే ఇల్లు ఉన్నట్లు పేరు కనుక ఉంటే, వారిని ఎంపిక చేసిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని, పేదవాని పేరు చేర్చకుండా జాబితా సిద్దమైన వారికీ అన్యాయం చేసిన ఎవరైనా రాజకీయ నాయకుల జోక్యం ఉన్నా ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి అన్నారని మంత్రి తెలిపారు.

ఈ విషయాన్ని కొందరు వక్రీకరించి ప్రభుత్వం  మరోమారు ఇళ్లస్థలాలు మంజూరు చేస్తున్నారని కనుక  దరఖాస్తు చేసుకోవాలని అసత్యాలు చేస్తున్నారని, అటువంటివి నమ్మరాదని మంత్రి పేర్కొన్నారు. 
 
*మంత్రికి అర్జీదారులు వినతి*  
1. కోవిడ్ - 19  దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అమలవుతున్న లాక్ డౌన్ సమయంలో మీటర్ రీడింగ్ తీయడం జరగలేదని, అయితే కొందరు విద్యుత్ శాఖాధికారులు ' పని లేదు - వేతనం రాదు ' అనే వాదాన్ని తీసుకువచ్చారని ఆర్థికపరంగా ఎంతో దుర్భరమైన జీవనం సాగిస్తున్న తమకు న్యాయం చేయాలంటూ వైస్సార్ ఎలక్ట్రికల్ మీటర్ల రీడర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు డి. వెంకటేశ్వరరావు, సాయల మురళీ, ప్రభుకుమార్, మౌలాలి మంత్రి ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు 90 శాతం వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారని అదే విధానం తమకు వర్తింపచేయాలని మంత్రి పేర్ని నానిను వారు అభ్యర్ధించారు. ప్రతిస్పందించిన ఆయన బుధవారం విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి మీ సమస్యను తీసుకెళతానని మీకు న్యాయం జరిగేలా చూస్తానని  వారికి భరోసా ఇచ్చారు. 

2. గతకొంత కాలంగా కాలినొప్పితో బాధపడుతున్నానని మచిలీపట్నం బైపాస్ రోడ్ కు చెందిన కొల్లి అప్పారావు  మంత్రి వద్ద తన ఆరోగ్య సమస్యను తెలిపాడు. సయాటిక లక్షణాలు గోచరిస్తున్నాయని కనుక మంచి వైద్యం అవసరమని , తగిన వైద్యుడి వద్దకు బాధితుడిని తీసుకెళ్లి వైద్యం చేయించాలని తన వ్యక్తిగత కార్యదర్శి శ్యామ్ కు  మంత్రి పేర్ని నాని ఆదేశించారు. 

3.స్థానిక వైస్సార కాలనీలో నివాసముంటున్న తమిళ నాదుకు చెందిన పలువురు నక్కల బాలరాజు ఆధ్వర్యంలో  మంత్రి వద్దకు వచ్చి తమకు నిత్యసరాలు లభించడం లేదని, పిల్లాపాలతో ఎంతో ఆర్ధిక ఇబ్బంది పడుతున్నామని పూట గడవని స్థితిలో రోజులు వెళ్లదీస్తున్నామని తమకు ఆహార వస్తువులు అందచేయాలని మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి మీకు ఏమేమి అవసరమో తన కార్యాలయంలో జాబితా ఇవ్వవలసిందిగా సూచించారు. 
 
4. పరాసుపేటకు చెందిన చప్పిడి రామకృష్ణ అనే గణాచారి మంత్రిని కలసి తమ సూచనతో కరోనా వ్యాప్తి కారణంగా 101 దేవతల సంబరాలు ఏప్రిల్ నెలలో  నిలిపివేశామని, దీంతో అమ్మవారు పలువురి వంటి మీదకు వచ్చి నా సంబరాల విషయమై ఏమి చేసేవని పదే పదే ప్రశ్నిస్తుందని తెలిపారు. దీనిపై మంత్రి జవాబిస్తూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మచిలీపట్నంలో అక్రమ మద్యం రవాణాపై ఉక్కు పాదం