న్యాయ ప్రక్రియలో కీలక పాత్ర పోషించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పిపి) అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లకు వివిధ కేసుల విచారణలో సమర్ధత, కష్టించి పనిచేసే తత్వం నిజాయితీ ఎంతో అవసరమని అటువంటి వారినే ప్రభుత్వం ఎంపిక చేసిందని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
శనివారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఇటీవల జిల్లా కోర్టు పరిధిలోని వివిధ కోర్టులలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు గా నియమించబడిన పలువురు మంత్రి పేర్ని నాని ని మర్యాద పూర్వకంగా కలిశారు.
వీరిలో జిల్లా కోర్టులోని 9 వ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా భోగిరెడ్డి వెంకన్నబాబు, మొదటి అదనపు జిల్లా కోర్టు కు ఏ పి పి గా మట్టా రామదాసు, 9 వ అదనపు జిల్లా కోర్టు కు ఏ పి పి గా పల్లపోతు అంకరాజు, 10 వ అదనపు జిల్లా కోర్టు కు ఏ పి పి గా కమ్మగంటి చంద్రశేఖర్, అదనపు అసిస్టెంట్ సెషన్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా అడపా మురళీ కృష్ణ లు ఉన్నారు.
ఈ అయిదుగురిని మంత్రి అభినందింస్తూ, బాధితుల తరుపున వాదించే మీరు న్యాయం వైపునే మొగ్గు చూపాలన్నారు. ప్రభుత్వం మీకు ఒక చక్కని అవకాశం ఇచ్చిందని, ఆ ప్రమాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే, ఏ కోశానా మీపై బాధితులకు అపనమ్మకం కలగరాదని తెలిపారు.
మీ ప్రవర్తన, నడవడిక, క్రమశిక్షణ ఎందరికో ఆదర్శం కావాలన్నారు. వీరితో పాటు మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు వడ్డీ జితేంద్ర మోహన్ లోహియా పలువురు న్యాయవాదులు హజరయ్యారు.