తెలంగాణాలో కరోనా కేసుల అప్‌డేట్స్ ...

Webdunia
ఆదివారం, 6 డిశెంబరు 2020 (11:21 IST)
దేశంలో కరోనా కేసుల సంఖ్య విజృంభణ కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 36,011 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 96,44,222 కి చేరింది. ఇక గత 24 గంటల్లో 41,970 మంది కోలుకున్నారు.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 482 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,40,182 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 91,00,792  మంది కోలుకున్నారు. 4,03,248 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
 
కాగా, దేశంలో శనివారం వరకు మొత్తం 14,69,86,575 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 11,01,063  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
తెలంగాణలో గత 24 గంటల్లో 622 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ఇద్దరు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 993  మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,73,341కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,63,744 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,472కి చేరింది.

తెలంగాణలో ప్రస్తుతం 8,125 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 6,116 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 104, రంగారెడ్డి జిల్లాలో 55 కరోనా కేసులు నమోదయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ సినిమా ప్రయాణం ఇంకా ముగియలేదా? నెక్ట్స్ సినిమా ఎవరితో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments