Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో మహా శివరాత్రికి 3,777 ప్రత్యేక బస్సులు

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (09:31 IST)
మహాశివరాత్రి పర్వదినానికి ఆర్టీసీ రాష్ట్రంలోని 98 శైవక్షేత్రాలకు మొత్తం 3,777 ప్రత్యేక బస్సుల్ని నడపనుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సాధారణ చార్జీలనే వసూలు చేయాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు సాధారణ టికెట్‌ రేట్లనే ఈ పండక్కి వసూలు చేయనున్నారు.

మహాశివరాత్రికి రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మంది భక్తులు ఆర్టీసీ సేవల్ని వినియోగించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట వద్దనున్న కోటప్పకొండకు 856 బస్సుల్ని, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, మహానంది, అహోబిలంలకు 938 బస్సుల్ని నడుపుతారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సుల్ని నడిపేందుకు ఇప్పటికే ఆర్టీసీ ఎండీ ఠాకూర్‌ అన్ని రీజియన్ల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

మాస్క్‌ తప్పని సరి..:
ఆర్టీసీ ఎండీ ఠాకూర్‌ కోటప్పకొండలో అధికారులతో సమావేశం నిర్వహించారు. మాస్క్‌ లేనిదే బస్సుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని, ప్రతి క్యాంప్‌లో శానిటైజర్ల స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతరలో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా మొబైల్‌ టీంలు ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments