Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవరకొండ వద్ద 23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Webdunia
గురువారం, 5 ఆగస్టు 2021 (08:37 IST)
తలకోన దేవరకొండ రోడ్డులోని చిన్నగొట్టి గల్లు మండలం దేవరకొండ అటవీ ప్రాంతంలో 23 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ ఎం సుందరరావు కు అందిన సమాచారం మేరకు ఆర్ ఎస్ ఐ లు లింగాధర్, విశ్వనాధ్ లు మంగళవారం రాత్రి నుంచి భాకరాపేట అటవీ పరిధిలోని ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు లో తనిఖీలు చేపట్టారు. 

బుధవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో దేవరకొండ బీట్ లోని బావికాడ పొదలు వద్ద చేరుకునే సమయానికి ఎర్రచందనం స్మగ్లర్లు అలికిడి వినిపించింది. కొంతమంది వ్యక్తులు భుజాలపై  ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు. దీంతో వారిని చుట్టు ముట్టే ప్రయత్నం చేశారు.

అయితే వారు దుంగలు పడవేసి చీకట్లో పారిపోయారు. ఆ ప్రాంతంలో 23 ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటిని స్వాధీనం చేసుకుని, టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. సిఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ సుందర రావు మాట్లాడుతూ ఎర్రచందనం ప్రజల సంపద అని, దానిని కాపాడుకోవడం మన ధర్మం అని తెలిపారు. స్మగ్లర్లు గురించి సమాచారం తెలిస్తే తమకు సమాచారం అందజేయాలని తెలిపారు. సమాచారం అందజేసిన వారి వివరాలు రహస్యం గా ఉంచుతామని తెలిపారు. 

ఈ దుంగలు 705 కిలోలు ఉండగా విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు.ఈ సమావేశంలో సిఐలు సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, వెంకట్ రవి, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, ఆర్ ఎస్ ఐ లు లింగాధర్, విశ్వనాధ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ ఫస్ట్ లుక్

Bhatti Vikramarka: కన్నప్ప మైల్ స్టోన్ చిత్రం అవుతుంది: మల్లు భట్టి విక్రమార్క

రైతుల నేపథ్యంతో సందేశం ఇచ్చిన వీడే మన వారసుడు మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments