Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో 227 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Webdunia
ఆదివారం, 27 డిశెంబరు 2020 (07:25 IST)
చిత్తూరు జిల్లా తెలుగు పిచ్చాటూరు సమీపంలోని అప్పంబెడు వద్ద లారీలో రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న 227 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటయ్య తెలిపారు.

ఆయన టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తున్న టి ఎన్ 61 ఎఫ్ 5578 లారీని సీజ్ చేసినట్లు తెలిపారు. గత ఐదు రోజులు నుంచి తమకు సమాచారం ఉందని అన్నారు. దీంతో టాస్క్ ఫోర్స్ బృందాలు ఎస్పీ ఆంజనేయులు ఆదేశాలతో ఆర్ ఐ భాస్కర్ నేతృత్వంలో మాటు వేశారని చెప్పారు. 

స్మగ్లర్లు తెలివిగా రవాణా వాయిదా వేస్తూ వచ్చారని తెలిపారు.  అయితే శనివారం తెల్లవారుజామున రవాణా చేస్తుండగా, తమ బృందం లారీని అడ్డుకున్నారని చెప్పారు. లారీ డ్రైవర్ ను పట్టుకోగలిగామని, అతనిని విచారించి, స్మగ్లింగ్ కు అసలు కారకులపై ఆరా తీస్తున్నామని తెలిపారు.

ఊత్తుకోట ప్రాంతాల్లో స్మగ్లర్లు కోసం గాలింపులు చేస్తున్నట్లు చెప్పారు. మరికొన్ని దుంగలు కూడా అడవిలో ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. వీటిని కొంతమంది స్థానిక స్మగ్లర్లు, తమిళులు కలసి సేకరించి నట్లు తేలిసిందన్నారు.

ఈ ఆపరేషన్ లో తిరుపతి టీమ్ లతో పాటు కోడూరు సబ్ కంట్రోల్ టీమ్ లు పాల్గొన్నాయాని అన్నారు. కే సును దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఇందులో పాల్గొన్న సిబ్బందిని ఆయన అభినందించారు.

ఈ సమావేశంలో సిఐ సుబ్రహ్మణ్యం, ఆర్ ఐ భాస్కర్, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, ఆర్ ఎస్ ఐ లు వాసు, సురేష్, వెంకట రవికుమార్ (కోడూరు),ఎఫ్ బి ఓ కోదండ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments