Webdunia - Bharat's app for daily news and videos

Install App

నమ్మించి తీసుకెళ్లి - మత్తుమందిచ్చి అత్యాచారం... ఎక్కడ?

ఓ యువతిని నమ్మించి తన వెంట తీసుకెళ్లి ఆ తర్వాత మత్తుమందిచ్చి అత్యాచారం చేసిన ఘటన ఒకటి విజయవాడలో వెలుగు చూసింది. విజయవాడ చిట్టినగర్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (13:07 IST)
ఓ యువతిని నమ్మించి తన వెంట తీసుకెళ్లి ఆ తర్వాత మత్తుమందిచ్చి అత్యాచారం చేసిన ఘటన ఒకటి విజయవాడలో వెలుగు చూసింది. విజయవాడ చిట్టినగర్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లక్ష్మణ్ అనే యువకుడు స్నేహితులతో కలసి చిట్టినగర్‌లో ఉన్న ఓ పాఠశాల మైదానానికి వచ్చి క్రికెట్ ఆడేవాడు. ఆ సమయంలో మైదానం పక్కనే ఉంటూ, అక్కడి మరో స్కూల్‌లో పనిచేస్తున్న ఓ యువతి (20)పై లక్ష్మణ్ కన్ను పడింది. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అన్నయ్యతోనే ఆ యువతి కలిసివుంటోంది.
 
ఈ క్రమంలో మంచినీళ్లతో ప్రారంభమైన వారి పరిచయం, ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకుని, మెసేజ్‌ల వరకూ వెళ్లింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులను పరిచయం చేస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లి, వారు బయటకు వెళ్లారని అంటూ, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపిచ్చి అత్యాచారం చేసి వీడియో తీశాడు. బయటకుచెబితే, వీడియోలు బయట పెడతానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. 
 
ఆపై పలుమార్లు సినిమాలకు, షికార్లకూ తిప్పి ఆమెను అనుభవించాడు. యువతి పెళ్లి ప్రస్తావన తేగానే తప్పించుకోవడం మొదలు పెట్టాడు. కనిపించకుండా పోయి, ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఆమె కొత్తపేట పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments