ఆర్టీసీ బస్సుల్లో చార్జీల తగ్గింపు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (14:43 IST)
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ చార్జీలను 20 శాతం మేరకు తగ్గించారు. ముఖ్యంగా, కృష్ణా జిల్లా హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే బస్సులో ఈ ప్రయాణ చార్జీల తగ్గింపు అమలుకురానుంది. కృష్ణా జిల్లాకు చెందిన అన్ని ఏపీఎస్ఆర్టీసీ బస్సులో 20 శాతం మేరకు బస్సు చార్జీలను తగ్గించాలని నిర్ణయించింది. 
 
ముఖ్యంగా, ఇంద్ర, అమరావతి, గరుడ, నైట్ రైడర్, వెన్నెల స్లీపర్ వంటి బస్సుల్లో తగ్గింపు చార్జీలు వర్తిస్తాయి. కృష్ణా జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ తగ్గింపు చార్జీలు వర్తిస్తాయి. అలాగే, హైదరాబాద్ నుంచి కృష్ణ జిల్లాకు వచ్చేవారికి మాత్రం శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో  ఈ తగ్గింపు ఉంటుంది. 
 
కాగా, ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ కూడా ప్రయాణికులను ఆకర్షించేందుకు పలు రకాలైన చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా, ప్రయాణికుల ముంగిటకే ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉండేలా చర్యలు తీసుకున్న విషయం తెల్సిందే. సంక్రాంతి కోసం నడిపిన ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు లేకుండా నడిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

ప్రభాస్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Vijay Kisses Rashimika: రష్మిక మందన్న తో తమ సంబంధాన్ని ప్రకటించిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

తర్వాతి కథనం
Show comments