Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనివాసా..? ఏమిటీ రికార్డులు.. 9 నిమిషాల్లో 15 వేల టోకెన్లు గోవిందా.. గోవిందా...

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (13:26 IST)
కరోనా ఎఫెక్ట్ ఇప్పటికీ తిరుమలపై కనిపిస్తోంది. భక్తుల రద్దీ తక్కువ చేసి కరోనా వ్యాప్తిని నిర్మూలించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్ ద్వారానే టోకెన్లను మంజూరు చేస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్సనం టోకెన్లు అయినా, ఉచిత సర్వదర్సనం టోకెన్లు అయినా ఏదైనా సరే ఆన్లైన్ లోనే తీసుకుని దర్సనానికి రావాల్సిన పరిస్థితి. 

 
ఇది గత కొన్నినెలలుగా సాగుతోంది. థర్డ్ వేవ్ కారణంగా కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశమే. దీంతో టిటిడి నిన్న ప్రత్యేక ప్రవేశ దర్సనం టోకెన్లు, నేడు ఉచిత సర్వదర్సనం టోకెన్లను విడుదల చేసింది. అయితే ఈ టోకెన్లు కాస్త హాట్ కేకుల్లాగా వెంట వెంటనే అయిపోతున్నాయి.

 
నిన్న విడుదల చేసిన ప్రత్యేక ప్రవేశ దర్సనా టోకెన్లు కాస్త 40 నిమిషాల్లో అయిపోయాయి. 300 రూపాయల టోకెన్లను అతి తక్కువ సమయంలోనే బుక్ చేసేశారు. నేటి ఉదయం విడుదల చేసిన సర్వదర్సనం టోకెన్లు ఉచితం. ఆ టోకెన్లు కాస్త 9 నిమిషాల్లో 15వేల టోకెన్లు అయిపోయాయి. 

 
అసలు చాలామంది భక్తులకు సైట్ కూడా ఓపెన్ కాకుండా బిజీ బిజీ అంటూ వచ్చేసింది. దీంతో చాలామంది భక్తులు నిరాశకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆన్లైన్ లో చాలామంది సామాన్య భక్తులు దర్సన టోకెన్లను బుక్ చేసుకోలేకున్న నేపథ్యంలో ఆఫ్ లైన్ ద్వారా అంటే కౌంటర్ల ద్వారా టోకెన్లు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారు టిటిడి ఉన్నతాధికారులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments