ఏపీలో జిల్లాల ఏర్పాటుపై ఓ వైపు హర్షం వ్యక్తమవుతుంటే మరోవైపు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పేర్ల మార్పిడి కోసం డిమాండ్లు పెరిగిపోతున్నాయి. తాజాగా హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ ఇప్పటికే తన నిర్ణయాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలని కోరుతూ అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు సంఘీభావంగా వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించాయి.
అయితే అనంతపురం జిల్లాను రెండుగా విభజిస్తున్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అయితే, దీనిని హిందూపురం వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ శనివారం బంద్‌కు అఖిలపక్షం పిలుపునిచ్చింది.