Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖోఖో ఆటలో బహుమతి.. మృత్యువు పాము రూపంలో వచ్చింది..

దేశ వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి వాటిలో గెలుపొందిన విజేతలకు బహుమతుల

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (13:27 IST)
దేశ వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించి వాటిలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ఇస్తుంటారు. ఇదే తరహాలో శ్రీకాకుళానికి చెందిన దీపిక పాఠశాలలో బహుమతిని గెలుచుకుంది. కానీ జీవితంలో గెలవలేకపోయింది. మృత్యువు పాము రూపంలో రావడంతో దీపిక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. 
 
వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని రుంకు గ్రామానికి చెందిన టంకాల దీపిక(13) పాము కాటుతో మృతి చెందింది.  టంకాల అప్పన్న, అమ్మలుకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుతూరు డిగ్రీ చదువుతుంది, చిన్న కుతూరు జగ్ననాథపురంలోని ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. బుధవారం పాఠశాలలో నిర్వహించిన స్వాంతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న దీపిక ఖోఖో ఆటలో గెలుచుకున్న బహుమతితో ఇంటికి వచ్చింది. 
 
ఆమె అందుకున్న బహుమతిని తల్లికి ఆనందంగా చూపించింది. ఆ తర్వాత బావి దగ్గర వున్న అక్క వద్దకు వెళ్లింది. ఆమె బట్టలుతుకుతుండగా, సబ్బు ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. పాము దీపికను కాటేసింది. స్థానికులు, కుటుంబీకుల సాయంతో దీపికను ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments