Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుయా ఆసుపత్రిలో మరణమృదంగం, ఏపీ, కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు

Webdunia
గురువారం, 20 మే 2021 (15:30 IST)
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక పలువురు కరోనా పేషెంట్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద చర్చకు తావిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని విపక్ష నేతలు విమర్శించారు.

మరోవైపు ఇదే అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఘటనలో మొత్తం 36 మంది ప్రాణాలు కోల్పోతే... రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 మంది మాత్రమే చనిపోయారని చెపుతోందని టీడీపీ నేత పీఆర్ మోహన్ పిటిషన్ వేశారు. మోహన్ తరపున కోర్టులో న్యాయవాది యలమంజుల బాలాజీ వాదించారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కోర్టులో వారు వాదించారు. పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ అంశంపై న్యాయ విచారణకు ఆదేశించాలని విన్నవించారు. కేవలం ఆక్సిజన్ అందకే అంతమంది చనిపోయారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఐదు ఆక్సిజన్ ప్లాంట్లను ఇచ్చిందని... అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు వాటిని నెలకొల్పలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు వేసవి సెలవుల తర్వాత తొలి రోజుకు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments