Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంగళగిరిలో బడా ఆసుపత్రి దోపిడీ, పేషెంట్ చనిపోయి అంత్యక్రియలు అయ్యాక కూడా డబ్బు కట్టాలంటూ ఫోన్...

మంగళగిరిలో బడా ఆసుపత్రి దోపిడీ, పేషెంట్ చనిపోయి అంత్యక్రియలు అయ్యాక కూడా డబ్బు కట్టాలంటూ ఫోన్...
, మంగళవారం, 18 మే 2021 (17:19 IST)
కరోనా మహమ్మారి  ప్రాణాలను హరిస్తున్న సమయంలో మంగళగిరిలోని బడా హాస్పిటల్ ,
ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుకుంటూ ప్రజల ప్రాణాలు తీస్తూ వారిని ఆర్థికంగా కూడా దోచుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి.
 
ఇటువంటి సంఘటనలు గతంలో అనేకం జరిగినా సరే ఇప్పటివరకు సదరు హాస్పిటల్ మీద ఎటువంటి అధికారి కూడా యాక్షన్ తీసుకోలేదు. వారం రోజుల క్రితం డిశ్చార్జ్ అయి చనిపోయిన వారి తరఫు బంధువులకు ఫోన్ చేసి పేషెంటుకు ట్రీట్మెంట్స్ జరుగుతుంది డబ్బులు కట్టండి.

ఈ రోజు డిశ్చార్జ్ చేస్తాము తీసుకోని వెళ్ళండి అంటూ రోజూ మెసేజ్‌లు పంపుతూ ఫోన్ చేస్తున్నారు సదరు ఆస్పత్రి సిబ్బంది. వారం రోజుల క్రితం చనిపోయిన పేషెంటుకు అసలు హాస్పటల్లో లేని పేషెంటుకి ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటే హాస్పటల్ వారు చేస్తున్న అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.
 
ఎవరి అండదండలతో ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. వీరి ఆగడాలకు నాయకులు కానీ అధికారులుగానీ చర్యలు తీసుకోలేరా???? ఈనెల మూడో తారీఖున సదరు ఆసుపత్రిలో పేషెంట్‌ని జాయిన్ చేయడం జరిగింది.
 
అనంతరం వారి తరపు వాళ్ళు ఎనిమిదో తారీఖున ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఈ రోజు కూడా సదరు ఆసుపత్రి సిబ్బంది పేషెంట్ తరపు వారికి ఫోన్ చేసి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇంజక్షన్ చేయాలి, డాక్టర్ గారు చూశారు మీరు వచ్చి డబ్బులు కట్టండి.
 
ఈ రోజు డిశ్చార్జ్ చేస్తామని ఫోన్ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ విషయం ఇప్పటివరకు అధికారులకు గాని నాయకులకు గానీ తెలియకుండా ఉందా????? తెలిసినా సరే వీరిపై యాక్షన్ తీసుకునే వారు ఎవరూ లేరా???? ఎందువల్ల ఇలా జరుగుతుంది? నాయకుల అండదండలతోనా?
లేక అధికారుల ప్రోద్బలంతోన?????

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడలో భారీగా నమోదవుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు