Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైలు నుంచి పరార‌యిన ఖైదీని చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్న న‌గ‌రి పోలీసులు

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (18:40 IST)
సత్యవేడు సబ్ జైలు నుండి పరారైన రిమాండ్ ఖైదీని న‌గ‌రి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నగరి సీఐ.మధ్దయ్యాచారి అందించిన వివరాల మేరకు నగరి పరిసర ప్రాంతాల్లో గత రెండేళ్లుగా నగరి, పల్లిపట్టు, తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో 40 కి పైగా పశువుల దొంగతనం జరిగింది. పశువుల దొంగలని పట్టుకోవడం కోసం పుత్తూరు సబ్ డివిజనల్ డీఎస్పీ, డాక్టర్. టీ.డీ.యశ్వంత్ ఆదేశాల మేరకు దాదాపు 25 కేసులలో సంబంధాలున్న పశువుల దొంగ సాయి(23)ని రెండు నెలల ముందు నగరి పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ చేసి సత్యవేడు సబ్ జైలుకు పంపారు. 
 
 
సత్యవేడు జైలులో 20 రోజులు ముందు సత్యవేడు సబ్ జైల్ సిబ్బంది కళ్ళు గప్పి గోడ దూకి పరారై పోయాడు. 20 రోజులుగా సబ్ జైల్ సిబ్బంది, పోలీసులు ముద్దాయి సాయిని పట్టుకోవడంలో ఇబ్బందులు  ఎదుర్కొంటున్న నేపథ్యంలో నగరి సీఐ. మద్దయ్యచారి, తన టీంతో 4 రోజులుగా రెక్కీ నిర్వహించారు. పక్కా ప్లాన్ ప్రకారం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాల్లో పట్టుకున్నారు. విచారణలో పోలీసుల రెక్కిని గమనించిన ముద్దాయి సాయి 20 రోజులుగా ఎలాంటి  ఆహారం లేకుండా కేవలం నీరు మాత్రం తాగుతూ అజ్ఞాతంలో ఉన్నాడన్న విషయం తెలుసుకుని నివ్వెరపోయారు. ఈ ఆపరేషన్లో సత్యవేడు సబ్ జైలు జైలర్ మ‌స్తాన్, నగరి క్రైం బ్రాంచ్ సిబ్బంది గవాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత శుభం టీజర్ అద్భుతం.. కితాబిచ్చిన వరుణ్ ధావన్ (video)

తెనాలిలో సమంతకి గుడి కట్టిన శామ్ అభిమాని- ట్రెండింగ్‌లో ఫోటోలు, వీడియోలు

Prabhas: ప్రభాస్ ఆరోగ్య సమస్య వల్లే రాజా సాబ్ చిత్రం ఆలస్యం అవుతుందా !

Yash: సెన్సేషనల్ అయ్యే దిశలో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ చిత్రం

Varma: ఆర్జీవీ అనుభవాలతో శారీ సినిమా తెరకెక్కించాడా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments