Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల విచిత్రం.. నేనుండగా నా భర్తకు ఎలా టిక్కెట్ ఇస్తారు.. భర్తపై రెబల్ అభ్యర్థిగా భార్య పోటీ... ఎక్కడ?

వరుణ్
శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (08:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపాలో పలు నియోజకవర్గాల్లో రెబల్స్ బెడద ఎక్కువైంది. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ దువ్వాడ శ్రీనివాస్‌కు ఆయన భార్య వాణి పక్కలో బల్లెంలా తయారయ్యారు. తన భర్తపై తాను పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నెల 22వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తానని ప్రకటించారు. మరోవైపు, ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ 19వ తేదీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. 
 
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఇపుడు అధికార వైకాపా రాజకీయ విచిత్రంగా మారింది. దీనికి కారణం సిట్టింగ్ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి చేసిన సంచలన ప్రకటనే. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె ప్రకటించడంతో వైకాపా నేతలు, శ్రేణులు ఖంగుతిన్నాయి. ప్రస్తుతం ఆమె జడ్పీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. గురువారం ఆమె జన్మదినం కావడంతో కార్యకర్తలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆమె వారితో మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన టెక్కలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించడంతో వారంతా ఒకింత షాక్‌కు గురయ్యారు. 
 
నిజానికి దువ్వాడ శ్రీనివాస్ దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారశైలితో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బందిగా మారుతుందని ఆమె సీఎం జగన్ దృష్టికి సైతం తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో వాణి టెక్కలి నియోజకవర్గం నుంచి ఇన్‌చార్జిగా వైకాపా నియమించింది. అయితే, ఆమె భర్త శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఆగ్రహించిన ఆమె... స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments