Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

19న మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నామినేషన్...

Chandrababu

వరుణ్

, గురువారం, 18 ఏప్రియల్ 2024 (12:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికలతో పాటు లోక్‌సభ స్థానాలకు కూడా ఎన్నికలు మె 13వ తేదీన నిర్వహిస్తారు. అయితే, ఎన్డీయే కూటమి తరపున కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుుడు ఈ నెల 19వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1.27 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరపున తొలిసారిగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు.
 
శుక్రవారం ఉదయం కుప్పం వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత భువనేశ్వరి నామినేషన్ పత్రాలను సమర్పిస్తారు. ఆ తర్వాత తన భర్త చంద్రబాబు తరపున ఆమె కుప్పంలో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఆ తర్వాత శనివారం కుప్పం ప్రజల సమక్షంలో చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె కుప్పం నుంచి బెంగుళూరుకు చేరుకుని అక్కడ నుంచి విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. 
 
అదేవిధంగా మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ టీడీపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేస్తారు. మధ్యాహ్నం 2.34 గంటలకు లోకేశ్ తరపున బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. ఉదయం సర్వమత ప్రార్థనలతో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ నేతలు ర్యాలీలు చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతీయ వ్యాయామ దినోత్సవం.. వ్యాధులను దూరం చేసి ఆరోగ్యాన్నిస్తుంది..